ఆంధ్రప్రదేశ్‌

మోహినీ అవతారంలో స్వామివారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 7: ముగ్ధమనోహర రూపంతో శ్రీ స్వామివారు మోహినీ అవతారంలో శ్రీ కృష్ణుడు వెంటరాగా తిరుమల మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను సమ్మోహితులను చేశారు. తిరుమలలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీ స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు అభయప్రదానం చేశారు. వజ్ర ఖచిత స్వర్ణాలంకార భూషితుడైన శ్రీ స్వామివారు మోహినీ అవతారంలో వాలుజడతో తనపైట తెరనుంచి ఓరచూపులతో చిరునవ్వులు చిందిస్తూ దంతపు పల్లకిపై అధిరోహించి చతుర్మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి అద్భుత సౌందర్యం చూసిన మహిళలు ఆహా..ఎంత అందం.. ఎంత అందం అని మనసులో ఒక్కసారైనా అనుకునేలా సాగింది. బ్రహ్మోత్సవాల్లో అన్ని వాహనాలు వాహన మండపం నుంచి బయల్దేరగా కేవలం మోహినీ అవతార వాహన సేవ మాత్రం ఆలయంలోని రంగనాయకుల మండపంనుంచి బయల్దేరడం విశేషం.

మోహినీ అవతారంలో శుక్రవారం ఉదయం
దర్శనమిచ్చిన స్వామివారు