రాష్ట్రీయం

మంత్రులను అవమానించిన చరిత్ర మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: కాంగ్రెస్ హయాంలో వై ఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి పనిచేసిన సీనియర్ నాయకులను, మంత్రులను అగౌరవపరిచే రీతిలో వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యవహరించారని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు. మంత్రులు జగన్ వేధింపులతో ఆ పార్టీని వీడి బయటకు వెళ్లారని, అహంకారం, లెక్కలేనితనం, అబద్దాలు భరించలేకనే పార్టీ వీడుతున్నట్టు కూడా వారు చెప్పారని లోకేశ్ పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమంలో తాను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడానికి వచ్చినపుడు మంత్రులు సభలో కూర్చోవడం సహజమే అయినా దానిపైనా నిందలు వేసి ప్రచారం చేయడం దారుణమని, తాను ప్రజలకు, కార్యకర్తలకు, పార్టీకి ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నానని చెప్పారు. తాను హఠాత్తుగా రాజకీయాల్లోకి రాలేదని, పార్టీపై చేస్తున్న ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. కాగా వేరొక కార్యక్రమంలో సాక్షి మీడియా లోకేశ్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె ఇ కృష్ణమూర్తి, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు ఆరోపించారు.