రాష్ట్రీయం

బాలిక మృతిపై విచారణకు బాలల హక్కుల సంఘం ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/బేగంపేట, అక్టోబర్ 8: మూఢ నమ్మకం ఓ బాలిక ప్రాణం తీసింది.. 64 రోజుల ఉపవాస దీక్షతో పదమూడేళ్ల ఓ బాలిక శనివారం మృతి చెందింది. దీనిపై బాలల హక్కుల సంఘం స్పందిస్తూ బాలిక మృతిపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్‌కు ఓ లేఖ రాయగా నార్త్‌జోన్ డిసిపి విచారణ చేపట్టారు. రెండు నెలల క్రితం, 64 రోజులు ఉపవాస దీక్ష చేపడితే మీ కుటుంబం బాగుపడుతుంని చెన్నైకు చెందిన ఓ జైన మత గురువు చెప్పడంతో మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాట్ బజార్‌లో జ్యుయలరీ షాపు నడిపిస్తున్న ఓ జైన కుటుంబం వారి కూతురు ఆరాధన (13)ను 64 రోజుల పాటు ఉపవాస దీక్షలో పెట్టారు. సదరు బాలిక నీళ్లు మినహా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా 64 రోజులు గడిపింది. ఈనెల 3న ఉపవాస దీక్ష పూర్తి కావడంతో జైనులంతా కలసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. అదే రోజు రాత్రి బాలిక ఆరాధన అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఇద్దరు వైద్యులు ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం తెలిసిన బాలల హక్కుల సంఘం మూఢ నమ్మకం ఓ బాలిక నిండు ప్రాణం బలిగొందని, ఈ ఘటనపై విచారణ జరపాలంటూ నగర పోలీస్ కమిషనర్‌కు ఓ లేఖ రాసింది. ఈ మేరకు ఘటనపై విచారణ జరుపుతున్నట్టు నార్త్‌జోన్ డిసిపి బి సుమతి తెలిపారు.

ఆరాధన (ఫైల్‌ఫొటో)