ఆంధ్రప్రదేశ్‌

సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 9: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఆదివారం ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనంలో మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మలయప్పస్వామి వారు రంగనాయకుల మండపంలో పట్టు పీతాంబరాలను అలంకరించి వజ్ర, వైఢూర్య, విశేష నవరత్న కిరీటంతో పాటు విశేషాభరణాలంకారాలు చేసుకుని సూర్యప్రభ వాహనంపై అధిరోహించారు. సూర్యుడు తేజోనిధి. సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత. అటువంటి సూర్యప్రభను అధిష్టించి స్వామివారు కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల మాడవీధులలో ఊరేగడం భక్తకోటికి ఆనందదాయకం. సూర్యప్రభపైన శ్రీనివాసుని దర్శనం స్వామివారి భక్తులకు పూర్ణ్ఫలాన్ని ప్రసాదిస్తున్నది. ఈ ఉత్సవంలో బ్రహ్మరథం ముందువైపు రాగా సూర్యభగవానుడి వేషధారణ, కోలాటాలు, చెక్క్భజనలు, మహిళల నృత్యాలు, దాససాహిత్య ప్రాజెక్టు వారి భజనలు, గజాలు, అశ్వాలు, వృషభాలు, వందిమాగధులు, జియ్యంగార్ల బృందం, మంగళవాయిద్యాలు, వేదపండితుల వేద పఠనాల మధ్య శ్రీహరి సూర్యప్రభ వాహనాన్ని అధిష్టించి తేజోవిరాజమానుడై భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. ఈ వాహన సేవ వల్ల ఆరోగ్యం , ఐశ్వర్యం పరిపూర్ణంగా భక్తులకు సిద్ధిస్తాయని వారి ప్రగాఢ నమ్మకం.
చంద్రప్రభ వాహనంపై రమావల్లభుడు
ఆదివారం రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహనంపై మలయప్పస్వామి వారు భక్తులను కటాక్షిస్తూ తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చారు. మలయప్ప స్వామి రంగనాయక మండపంలో పట్టుపీతాంబరాలు ధరించి వజ్ర వైడూర్యాలు విశేషాభరణాలంకృతుడై చంద్రప్రభ వాహనంలో దర్శనమిచ్చారు.

చిత్రం... సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్న శ్రీవారు.