రాష్ట్రీయం

సేంద్రీయ ఎరువులుగా వ్యర్థ పదార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: వ్యర్థపదార్థాలను సేంద్రీయ ఎరువులుగా మార్చే ప్రక్రియకు టన్నుకు 1500 రూపాయల సబ్సిడీ ఇస్తున్నామని, విద్యుత్తు తయారీ ప్రక్రియకూ సబ్సిడీ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. స్వచ్ఛ్భారత్‌పై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్ధ, ఇతర ప్రముఖులు నిర్మించి లఘచిత్రాలను ఆదివారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రజలలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేందుకు 31.20 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావుకు అందజేశారు. మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వెంకయ్య అభినందించారు. స్వచ్ఛ భారత్‌పై ప్రజల్లో మరింత చైతన్యం తెచ్చేందుకు సినిమా థియేటర్లలో లఘు చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2019 నాటికి దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ఈ లఘుచిత్రాలు ప్రజలలో చైతన్యం తెస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్ధ స్వల్ప వ్యవధిలో లఘు చిత్రాల నిర్మాణానికి ఎంట్రీలను ఆహ్వానించగా 4346 చిత్రాలు పరిశీలనకు వచ్చాయని, వాటిలో పదింటిని ఉత్తమ చిత్రాలుగా ఎంపికి చేసినట్లు ఆయన చెప్పారు. దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలంటే త్రిము ఖ వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, కనీస సౌకర్యాల కల్పన, బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణం కీలకమని ఆయన అన్నారు. అయినా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా వసూలు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన చెప్పారు. అనంతరం స్వచ్ఛ భారత్ కోసం కొంత సమయం కేటాయిస్తామని, భాగస్వాములు అవుతామని ఆయన సభికులతో ప్రమాణం చేయించారు.

చిత్రం... కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర పట్టణాభివృద్ధి,
సమాచార ప్రసార శాఖల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు