ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక వ్యవస్థకు ఇస్రో ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 9: భారత అంతరిక్ష పరశోధనా సంస్థ(ఇస్రో) విజయాలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయ. వరుస విజయాలపై ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేయటంతో పాటు ఇస్రో విజయాలపై ప్రధాన మంత్రి కార్యాలయం సమీక్షిస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే అంతరిక్ష పరిశోధనలకు బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాల్లో భారత్ తన సత్తా చాటడం తెలిసిందే. ఇటీవల కాలంలో 20 ఉపగ్రహాలను ఒకేసారి వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టడం, మంగళయాన్, చంద్రయాన్-1 వంటి విజయాలను సొంత చేసుకుంది. విజయాల వెనుక కారణాలను పిఎంఒ తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇస్త్రో శాస్తవ్రేత్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
అంతరిక్ష పరిశోధనలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతోందని భావించి ఉపగ్రహాలు, రాకెట్ల తయారీపై 1966లో దృష్టి సారించారు. కేరళలోని తుంబ నుంచి 1975లో రోహిణి-75 పేరుతో రాకెట్‌ను తొలిసారిగా ప్రయోగించారు. ఆ తర్వాత అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి వంటి ర్యాకెట్లను అభివృద్ధి చేసింది. అనేక దేశీయ ఉపగ్రహాలను, విదేశీ ఉపగ్రహాలు వివిధ కక్ష్యలో ప్రవేశపెట్టి భారత్‌కు అంతరిక్ష పరిశోధనా రంగంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకుంది. మార్స్ గ్రహంపై పరిశోధనలకు మంగళయాన్, చంద్రునిపైకి పరిశోధనలకు చంద్రయాన్-1ను చేపట్టింది. చంద్రునిపై నీటి జాడలు ఉన్న విషయాన్ని చంద్రయాన్ ద్వారా ప్రపంచానికి వెల్లడించింది. భారత్ వద్ద ఉన్న సమర్ధవంతమైన పిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టడం తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఎక్కువ దేశాలు భారత్‌వైపు మొగ్గుచూపుతున్నాయి. కమ్యూనికేషన్లకు సంబంధించిన ఉపగ్రహాలను భూమికి 36 వేల కిలోమీటర్ల దూరంలో జియో సింక్రనస్ కక్ష్యలో ప్రవేశపెట్టంలో కూడా తనదైన ముద్ర వేసుకుంది. ఒక దశలో భారత్ నుంచి ఉపగ్రహాలను ప్రయోగించవద్దని అమెరికా అక్కడి సంస్థలకు అడ్వైయిజరీ జారీ చేయడం గమనార్హం.
ఇప్పటికే పిఎస్‌ఎల్‌వి రాకెట్ విజయంతో కొత్త లాంచింగ్ వెహికల్‌ను రూపొందించే దిశగా ఇస్త్రో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎల్‌విఎంకె3 అనే లాంచింగ్ వెహికల్‌ను ప్రయోగాత్మకంగా వచ్చే ఏడాది ప్రయోగించనున్నారు. 4 టన్నుల పేలోడ్‌ను (ఉపగ్రహాలను) తీసుకువెళ్లే విధంగా ఈ లాంచింగ్ వెహికల్‌ను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 3.5 టన్నుల బరువైన ఉపగ్రహాలు తీసుకువెళ్లే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది.
బడ్జెట్ తక్కువైనా...
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో అంతరిక్ష పరిశోధనలకు నిధుల కేటాయింపులు తక్కువే. అమెరికా వంటి దేశాల బడ్జెట్‌తో పోలిస్తే అందులో 10 శాతం కూడా ఉండదు. బడ్జెట్ కేటాయింపులు తక్కువైనప్పటికీ ఉన్న వనరులను, మేథోసంపత్తిని, అనుభవాలను ఉపయోగించుకుని ప్రపంచంలో తన సత్తా చాటుకుంటోంది.
వరుస విజయాల వెనుక ఇస్రో పరివారం సమష్టి కృషి, లక్ష్య సాధనకు సమయపాలన వంటివి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇస్రో శాస్తవ్రేత్తలు, ఇంజనీర్లు నిరంతరం నిర్ణీత కాలంలోగా ఆ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తుంటారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఖర్చును కూడా నియంత్రించేందుకు వీలు అవుతుంది. ప్రాజెక్టు పూర్తి కావడంలో జాప్యం చోటు చేసుకోకుండా అన్ని దశల్లో చర్యలు తీసుకోవడం కూడా విజయాలకు బాటలు వేసింది. ఇస్రో చేపట్టిన వివిధ తొలి ప్రయోగాల్లో కూడా విజయాలను కైవసం చేసుకోవడం గమనార్హం. దీంతో ఇస్రో విజయాల వెనుక కారణాలపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆసక్తి కనబరచడం గమనార్హం. ఉపగ్రహాలు, రాకెట్లు, ఇతర పరికారాల తయారీ, ఉపగ్రహ ప్రయోగాల్లో కచ్చితత్వం, నాణ్యత, తదితర అంశాల్లో ఇస్రో తీసుకుంటున్న శ్రద్ధ తదితర అంశాలపై పిఎంఒ వివరాలను కోరినట్టు సమాచారం. ఇస్రో దేశంలోని వివిధ పరిశోధనా సంస్థలకు మార్గదర్శకంగా ఉండేలా చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

డిమాండ్ ఎక్కువే...
కమ్యూనికేషన్లకు సంబంధించి ఒక ఉపగ్రహాన్ని ఇతర దేశం నుంచి ప్రయోగించేందుకు దాదాపు 900 కోట్ల రూపాయలు భారత్ ఖర్చు చేసినట్టు సమాచారం. దీంతో భారీ ఉపగ్రహాలను ప్రయోగించే దిశగా ప్రయత్నాలు ఇస్రో ప్రారంభించింది. భారత్ నుంచి ఉపగ్రహాల ప్రయోగం తక్కువ ఖర్చు కావడంతో అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. కానీ వివిధ కారణాలతో ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు ఇస్రోకు కేటాయించడం ద్వారా మరిన్ని అద్భుతాలను ఆవిష్కరించే అవకాశం ఉంటుంది.