రాష్ట్రీయం

దేవతల లోయలో దసరా ( అంతర్జాతీయ ఖ్యాతిపొందిన కులు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మికతకు ఆలవాలమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని కులును దేవతల లోయగా పిలుస్తారు. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలు అంతర్జాతీయంగానూ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వారం రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను చెడుపై మంచి సాధించే విజయంగా భావిస్తారు. అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించటానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. పచ్చటి పర్వత శ్రేణులు, గల గలపారే జలపాతాలు, భక్తిపారవశ్యాన్ని పెంపొందించే ఆలయాలతో నిండివుండే ఈ కులు లోయ ఏడురోజుల పాటు నృత్యాలు, సంగీతోత్సవాలతో రంగుల హరివిల్లులా శోభిస్తుంది. దాదాపు 17వ శతాబ్దం నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. ఉత్సవాలు ఆరంభం రోజున వేలాది మంది భక్తులు ఒకచోట చేరి రఘునాథ స్వామి ప్రతిమను రథంపై ఉంచి ఊరేగిస్తారు. స్థానిక భక్తులు వేలాదిమంది పాల్గొని రథాన్ని లాగటం పుణ్యఫలంగా భావిస్తారు. రఘునాథ స్వామితో స్థానిక గ్రామ దేవతల విగ్రహాలు కూడా ఈ రథంపై కొలువుతీరతాయి. ఆఖరి రోజున బియాస్ నది వద్ద ప్రజలంతా గుమిగూడ లంక దహనం జరిగినట్లు కట్టెలు, గడ్డితో దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
చారిత్రిక నేపథ్యం..
కులు లోయను రాజా జగత్‌సింగ్ పాలిస్తున్న రోజులవి. ఆనాడు దుర్గాదత్ అనే బ్రాహ్మాణ రైతు వద్ద అందమైన ముత్యాలు ఉంటాయి. ఆ ముత్యాలను రాజు సొంతం చేసుకోవాలనుకుంటాడు. రైతు అందుకు అంగీకరించడు. ఆగ్రహించిన రాజా జగత్ సింగ్ క్రౌర్యానికి ఆ రైతు తనతో పాటు తన కుటుంబాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటాడు. ఈ విషాద సంఘటనతో పశ్చాత్తాపానికి గురైన రాజా జగత్‌సింగ్ వ్యాథిగ్రస్తుడవుతాడు. చివరకు పెద్దల సలహాతో రాముడు జన్మించిన అయోధ్యలోని రఘునాథ స్వామి విగ్రహాన్ని తెప్పించి పూజలు నిర్వహించాలనుకుంటాడు. రాజు అయోధ్యకు ఓ బ్రాహ్మణుడిని పంపించి రఘునాథస్వామి విగ్రహాన్ని తీసుకురమ్మంటాడు. ఆ విగ్రహాన్ని తీసుకువస్తుండుగా అది అదృశ్యమవుతుంది. విగ్రహం కోసం వెతకగా సరయు నది వెనుక ఆ రఘునాథ స్వామి కనిపిస్తాడు. విచిత్రమేమిటంటే అయోధ్య నుంచి తీసుకువచ్చేటపుడుఎంతో బరువు ఉన్న ఆ విగ్రహం అక్కడ చాలా తేలికవుతుంది. అంతేకాదు అది కులువైపు కదలి అక్కడ కొలువుతీరింది. అప్పటి నుంచి కులు లోయ ప్రజలకు రఘునాథ స్వామి ఆరాధ్య దైవంగా మారిపోయారు. ఆనాటి నుంచే అక్కడ దసరా ఉత్సవాలు ఏడు రోజుల పాటు ఘనంగా నిర్వహించటం ఆరంభమైంది. దసరానాడు కనీసం 5లక్షలమంది ఇక్కడికి రావడం విశేషం.
chitram...
కులులో వైభవంగా జరిగే రఘునాథ స్వామి రథోత్సవం

దసరా సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు