ఆంధ్రప్రదేశ్‌

ఏజెన్సీ గిరిజనులకు కందిపప్పు ఉచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 10: పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ఉచితంగా కందిపప్పు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం గిరిజన ప్రాంతాల్లో నెలకు కిలో చొప్పున ఏడాదిపాటు ఉచితంగా కందిపప్పు పంపిణీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించిన చంద్రబాబు, అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు లక్షల గిరిజన కుటుంబాలకు ఉచిత కందిపప్పు అందించనున్నామని, దీనికి రూ.57 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఏజెన్సీ గిరిజనుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్లే వ్యాధులకు తట్టుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. దోమల నుంచి గిరిజనులకు రక్షణ కల్పించేందుకు పెద్ద ఎత్తున దోమతెరల పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనిలోభాగంగా విశాఖలో దోమతెరల పంపిణీని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఏజెన్సీలో రక్షిత మంచినీటి సదుపాయం లేకపోవడం కూడా ఒక కారణంగా గుర్తించామని, రూ.219 కోట్లతో మినరల్ వాటర్ సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వస్తే వారికి అప్పగించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో అపారమైన వనరులున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రాంతాలను, అక్కడి ప్రజలను అభివృద్ధి దిశగా నడిపేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు.

చిత్రం...
దోమ తెరలు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు