రాష్ట్రీయం

తెలంగాణ రుచులతో రేపు అలయ్-బలయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏడాది అలయ్-బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించే కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ నెల 12వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సద్దఅప్పలు, కోడిపులుసు, సర్వపిండి, పచ్చిపులుసు, గుడాలు, దబడం వంటి అనేక తెలంగాణ వంటలను సిద్ధం చేయిస్తున్నారు. కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్, సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు.