జాతీయ వార్తలు

మోదీ నోట జై శ్రీరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 12: గత ఐదు సంవత్సరాలుగా అయోధ్యలోని రామాలయ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా దాటవేస్తూ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇక్కడి ఐష్‌బాగ్ రామ్‌లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ‘జై శ్రీరామ్’ అనడం సర్వత్రా ఊహాగానాలకు దారితీస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్యే బిజెపి నినాదం కాబోతోందని చెప్పడానికి ఇది సంకేతమన్న కథనాలు వెలువడుతున్నాయి. ఉగ్రవాదంపైనే ప్రధానంగా తన ప్రసంగంలో విరుచుకు పడ్డ మోదీ రామనామ స్మరణ చేయడం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాల్లో ఎంతో ఆనందాన్ని రేకెత్తించింది.ఓ బహిరంగ వేదికపై ‘జై శ్రీరామ్’అని మోదీ అనడం ఇదే మొదటిసారి. రాముడి పేరును మోదీ ప్రస్తావించడం రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నదేనని కొందరు భావిస్తున్నప్పటికీ ఆయన ఉద్దేశం అయోధ్య కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమాజ్‌వాది పార్టీ సహా బిజెపి ప్రత్యర్థి పార్టీలు మోదీ మాటలు రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నవేనంటూ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో బిజెపి వర్గాలకు ఇది మరింత ఆత్మస్థయిర్యాన్ని ఇచ్చింది. 2017లో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న బిజెపికి తాజా పరిస్థితులు మరింత ఉత్సాహాన్ని అందించాయి. జైశ్రీరామ్ అన్న నినాదం అయోధ్యకు సంబంధించినదే అయినప్పటికీ ప్రధాని మోదీ రామ్‌లీలా మైదానంలోనే ఈ మాట అన్నారు కాబట్టి దానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ స్పష్టం చేశారు. రామ్‌లీలా మైదానంలో జరిగింది మతపరమైన కార్యక్రమం కాబట్టి ప్రధాని మోదీ ఇంకేమి మాట్లాడతారని భావిస్తామని ఎదురు ప్రశ్న వేశారు. బిజెపితో పాటు ఆర్‌ఎస్‌ఎస్ వర్గాల్లో కూడా ‘జై శ్రీరామ్’నినాదం సరికొత్త ఉత్సాహాన్ని కలిగించింది. ‘దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయం కాబట్టి ప్రజల్లో ఉన్న ఆ ఉత్సాహానే్న ప్రధాని మోదీ తన మాటల్లో ప్రతిబింబించారని ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి మన్‌మోహన్ వైద్య అన్నారు. ప్రధాని మోదీ రాముడి పేరు స్మరించడం భారతీయ విలువల్ని పునరుద్ఘాటించడమేనని సంఘ్ సిద్ధాంత కర్త రాకేశ్ సింగ్ అన్నారు.

చిత్రం... లక్నోలో మంగళవారం నిర్వహించిన దసరా ముగింపు వేడుకల్లో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని మోదీ నోట ‘జై శ్రీరామ్’ మాట బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాల్లో సరికొత్త ఉత్సాహం రేకెత్తిస్తోంది. చెడుపై మంచి విజయానికి సంకేతంగా దసరా సందర్భంగా మోదీ రామనామస్మరణ
చేశారని ఈ రెండు వర్గాలు చెబుతున్నాయి. యూపీ ఎన్నికల్లో విజయానికి ‘అయోధ్య’ను తెరపైకి తేవడమే మోదీ మాటల ఉద్దేశమని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాముడి పేరుతో అయోధ్యకు సంబంధం ఉన్నా.. మోదీ మాటల్లో రాజకీయ కోణం ఏదీ లేదని బిజెపి సీనియర్ నేత ఒకరు
వివరించారు. రామ్‌లీలా మైదానంలో రాముడి పేరు స్మరిస్తే రాజకీయ
దురుద్దేశమేమిటనీ ప్రశ్నించారు.