ఆంధ్రప్రదేశ్‌

బన్ని ఉత్సవం రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, అక్టోబర్ 12: సంప్రదాయం, సంస్కృతి పేరుతో సాగిన బన్ని ఉత్సవం ఈ సంవత్సరం కూడా రక్తసిక్తంగా మారింది. వంద మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగడాలు విసరడంతో పలువురికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా హొళగుంద మండలం నెరణికి నుంచి ఊరేగింపుగా బయలుదేరిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు తమ దేవుళ్లను రక్షించుకుంటామని డోళ్ళబండ వద్ద పాల బాసలు చేశారు. ఆ తరువాత కలెక్టర్, ఎస్పీకి బన్ని అందించి ఉత్సవం జరుపుకోవడానికి అనుమతి కోరారు. అధికారులు అనుమతి ఇవ్వగానే అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న గట్టుమల్లయ్యకొండలు ఒక్కసారిగా డూర్.... గోపరాక్ అన్న నినాదాలతో మారుమోగాయి. బాణసంచా పెద్ద ఎత్తున పేల్చారు. ఒక్కసారిగా వేలాది మంది భక్తులు కర్రలతో పరుగులు పెడుతూ కొండపైకి చేరుకున్నారు. దేవాలయానికి ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం జరిపించి తిరిగి నినాదాలు చేసుకుంటూ కర్రలు మధ్య ఉత్సవమూర్తులను తీసుకుని కిందికి వచ్చారు.
కర్రలు, కాగడాల వెలుతురు మధ్య జరిగిన బన్ని ఉత్సవం భయాన్ని కలిగించింది. ఎటుచూసినా కర్రలు, వేలాదిమంది భక్తులు, కాగడాలు.. కర్రలు తగిలి తలలు పగలడం, రక్తంకారుతున్న కాళ్ళు, చేతులు వెన్నుల్లో వణుకు పుట్టించింది. కొత్తపేట, నెరణికి, నెరణికితడా గ్రామాల ప్రజల కర్రల మధ్యనే ఉత్సవమూర్తులను రాక్షసపడ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ గొర్రవయ్య తొడలో డబ్బనం గుచ్చుకొని రక్తం తీసి రాక్షసపడ వద్ద చల్లి శివపార్వతులుకు ఇచ్చిన మాట చెల్లించారు. ఆ తరువాత శమీవృక్షం వద్ద పూజలు చేసిన అనంతరం తిరిగి ఉత్సవమూర్తులను శివాసానం కట్ట వద్దకు తీసుకువచ్చారు. దీంతో ఉత్సవం ముగిసింది. కర్రలు తగిలి 37మంది తలలు పగిలాయి. కాగడాలు విసరడంతో అగ్నికీలలకు ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. తుంబళబీడు గ్రామానికి చెందిన చిన్న తిక్కన్న, ఆలూరుకు చెందిన సంజన్న తలలకు తీవ్రగాయాలయ్యాయి. 37 మందికి అక్కడే ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో చికిత్స చేశారు. ఎఎస్‌ఐ తిలోఫిలస్ అస్వస్థతకు గురయ్యారు. ఈసారి ఉత్సవంలో రక్తపాతం తగ్గిందని, ప్రజల్లో అవగాహన కల్పించామని కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణ అన్నారు.

కర్రలు, కాగడాల వెలుతురులో కొనసాగిన బన్ని ఉత్సవం