ఆంధ్రప్రదేశ్‌

సంప్రదాయానిదే పైచేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 12: కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవంలో అవాంఛనీయ సంఘటనలు నివారించడానికి అధికారులు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం అనాదిగా భక్తులు పాటిస్తున్న సంప్రదాయం ముందు తలవంచాల్సి వచ్చింది. డ్రోన్ కెమెరా, సీసీ కెమెరాలు, హైమాస్ట్ లైట్లు వంటి ఆధునిక పరిజ్ఞానం వినియోగించడంతో పాటు, కర్రలతో కొట్టుకుంటే నిందితులను గుర్తించి కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు చేసిన హెచ్చరికలు పని చేయలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కర్రల సమయంలో పాల్గొనే ప్రజల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్న అధికారుల ప్రయత్నం విఫలమై యథావిథిగా బన్ని ఉత్సవంలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి ఉత్సవంలో దసరా పర్వదినమైన బుధవారం అర్ధరాత్రి 13గ్రామాల ప్రజలు బన్ని ఉత్సవంలో కర్రలతో పాల్గొని తమ సంప్రదాయాన్ని ఎవరూ అడ్డుకోలేరని నిరూపించారు. సమరంలో పోలీసులు 21 మందికి గాయాలు అయ్యాయని ప్రకటించగా, ఆ సంఖ్య 50కి పైగా ఉంటుందని భావిస్తున్నారు. మాళమల్లేశ్వరస్వామి వారికి నెరణికి గ్రామం నుంచి నెరణికి తండా, కొత్తపేట గ్రామస్థులు రాత్రిపూట గ్రామోత్సవం నిర్వహిస్తారు. అక్కడి నుంచి కొండపైకి చేరుకుని అక్కడ ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మళ్లీ శివసానం కట్ట వద్దకు తీసుకువచ్చి ఉత్సవమూర్తులను ఆశీనులను చేస్తారు. ఈ ఉత్సవం ముందు భక్తులు కర్రల సమరం చేస్తూ తమ భక్తిని చాటుకుంటారు. ఈ సమయంలో భక్తులు కర్రలతో కొట్టుకుంటారు. దీని కారణంగా పెద్దఎత్తున భక్తులకు రక్తగాయాలవుతాయి. ఈ ఉత్సవంలో రక్తగాయాలను నివారించాలన్న మానవహక్కుల కమిషన్ ఆదేశాలతో పోలీసులు గత కొనే్నళ్లుగా తీసుకుంటున్న చర్యలు నామమాత్రపు ఫలితాన్నిచ్చాయి. ఈ ఏడాది ఏకంగా డ్రోన్ కెమెరాతో పాటు 50కి పైగా సీసీ. కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కంట్రోల్ రూం నెలకొల్పారు. అంతేగాకుండా బన్ని ఉత్సవంలో పాల్గొనే 13 గ్రామాల్లో 144వ సెక్షన్ విధించి ఎలాంటి మద్యం గ్రామాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొన్నారు. అంతేగాక గ్రామాల్లో ఉత్సవమూర్తులు తిరిగే వీధులను వెడల్పు చేసి సిమెంటు రహదారులు కూడా నిర్మించారు. భారీ లైటింగ్ ఏర్పాటు చేసి కర్రల సమయంలో కొట్టుకునే వారి దృశ్యాలను డ్రోన్, సిసి కెమెరాల ద్వారా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు చేపట్టిన చర్యలు గ్రామస్థుల సంప్రదాయం ముందు పనికిరాలేదు. యథావిథిగా ఉత్సవంలో వేల సంఖ్యలో పాల్గొనడమే కాకుండా కర్రల సమరం నిర్వహించి తమదే పైచేయి అనిపించుకున్నారు. అయితే ప్రాణనష్టం చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.