ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 12: మత సామరస్యానికి మారుపేరుగా పేరొందిన నెల్లూరు రొట్టెల పండగ బుధవారం నుంచి ప్రారంభమైంది. నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గా ప్రాంగణంలో ప్రారంభమైన ఈ రొట్టెల పండగ ఈనెల 16వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండగను రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో భక్తుల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. గత ఏడాది 6 లక్షల మంది వరకు భక్తులు హాజరుకాగా, ఈ ఏడాది 10-12 లక్షల వరకూ భక్తులు వచ్చే అవకాశం ఉందనే అంచనాల నడుమ జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు ఈ పండగకు హాజరవుతుంటారు.
నేడు గంధం మహోత్సవం
రొట్టెల పండగలో ముఖ్య ఘట్టమైన గంధ మహోత్సవం గురువారం రాత్రి దర్గాలో నిర్వహించనున్నారు. ఈ గంధ మహోత్సవానికి కడప దర్గా పీఠాధిపతి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడే ఉన్న స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి జరుగుతుంది. భక్తులు తమ కోర్కెలు తీర్చాలని కోరుతూ రొట్టెలు మార్చుకోవడం ఇక్కడ ప్రత్యేకత. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నెల్లూరుకు విచ్చేస్తున్నారు.