ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన శరన్నవరాత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 12: శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు మంగళవారం పూర్ణాహుతితో ముగిశాయి. దసరా పర్వదినం సందర్భంగా ఉదయం అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, యగాంగ హవనాలు, చండీహోమం, రుద్రహోమం, జయాది హోమాలను అర్చకులు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. యాగశాలలో చండీహోమ పూర్ణాహుతి, స్వామివారి యాగశాలలో రుద్రయాగ పూర్ణాహుతి నిర్వహించారు. కలశ ఉద్వాసన, వసంతోత్సవం, అవబృంద కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి సరస్వతి అంతర్వాహినిలో స్వామివారి త్రిశూల స్నానం చేయించారు. అనంతరం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి ద్రవ్యాలను సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారు ఉత్సవమూర్తిని నిజరూపమైన భ్రమరాంబదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి అష్ట్భుజాలు కలిగి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిగణను ధరించి ఉంటుంది. దసరా మహోత్సవాల్లో భాగంగా చివరిరోజు స్వామి అమ్మవార్లు నందివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులకు అక్కమహాదేవి అలంకరణ మండపంలో ఆలయ అర్చక వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రదక్షణ అనంతరం శమీపూజ నిర్వహించారు. జమ్మి ఆకులు అందరూ పంచుకున్నారు. అనంతరం నందివాహనంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పూజాదికార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి దంపతులు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఆలయ ఈఓ నారాయణ భరత్‌గుప్త, జెఇఓ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నంది వాహనంపై ఆది దంపతులకు గ్రామోత్సవం