తెలంగాణ

చిన్నారి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, అక్టోబర్ 12: ముక్కుపచ్చలారని ఏడేళ్ల చిన్నారిని దుండుగులు గొంతు, ఎడమ చేతి మణికట్టు నరాలను కోసి అతి దారుణంగా హతమార్చిన సంఘటన మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట్‌లో చోటు చేసుకుంది. పండుగ రోజు జరిగిన ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన గొర్ల కృష్ణమూర్తి భార్య భవానీతో కలిసి పది సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం మండలంలోని ఎల్లంపేట్ గ్రామానికి వలసవచ్చి స్థిరపడ్డారు. కృష్ణమూర్తి కొంపల్లిలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో డ్రైవర్‌గా పని చేస్తుండగా భార్య భవానీ కాళ్ళకల్ గ్రామంలోని మైకో విత్తనాల కంపెనీలో పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు కావ్యశ్రీ (10), సాయిలక్ష్మి ప్రసన్న (7) ఉన్నారు. వీరిద్దరు మేడ్చల్ పట్టణంలోని సాధన స్కూల్‌లో చదువుతున్నారు. కాగా, పిల్లలకు దసరా సెలవులు కావడంతో దంపతులిద్దరూ వారిని ఇంటి వద్దనే ఉంచి బుధవారం రోజు మాదిరిగానే ఉద్యోగాలకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో పక్కనే ఉండే చిన్నమ్మ లక్ష్మి పిల్లలు మధ్యాహ్నం భోజనం చేశారో లేదో కనుక్కునేందుకు వచ్చి బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న సాయిలక్ష్మిని చూసి నిర్ఘాంతపోయింది. కొన ఊపిరితో ఉన్న సాయిలక్ష్మిని పట్టణంలోని లీలా ఆసుపత్రికి తరలించగా, చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందిందని నిర్ధారించారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న మృతురాలి అక్క కావ్యశ్రీ గదిలో నిద్రపోతుండడంతో సంఘటన గురించి ఆమెకు తెలియకపోవడం గమన్హారం. ఇంటిలోని పెంపుడు కుక్క కొత్తవారు ఎవరు వచ్చినా లోనికి రానివ్వదని, అయితే సాయిలక్ష్మి హత్య సమయంలో కుక్క పెద్దగా అరవకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్థులు అంటున్నారు. తెలిసిన వారు లేదా నిత్యం ఇంటికి వచ్చి పోయే వారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న మేడ్చల్ సిఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హత్య జరిగిన బాత్‌రూమ్‌ను పరిశీలించగా రెండు బ్లేడ్లూ, ఓ చిన్న కత్తెర పోలీసులకు లభించింది. క్లూస్‌టీం, జాగిలాలను రప్పించి విచారణ చేపట్టారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
అభం శుభం తెలియని చిన్నారి సాయిలక్ష్మి ప్రసన్నను అతి కిరాతకంగా హతమార్చిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గ్రామానికి చెందిన మండల బిజెపి అధ్యక్షుడు జగన్‌గౌడ్, ఎంపిటిసి రేణుక, సర్పంచ్ తుడుం లింగం తదితరులు డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.