రాష్ట్రీయం

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని డైరెక్టర్ జనరల్ నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఎంత సమయం అవసరమని హైకోర్టు విచారణ సందర్భంగా ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పివి రమేష్‌ను ప్రశ్నించింది. నివాసాన్ని ఖాళీ చేయాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ డాక్టర్ రమేష్ హైకోర్టు ధర్మాసనం ఎదుట అపీల్ చేశారు. ఈ అపీల్‌ను ధర్మాసనం విచారించింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి నెల రోజుల్లోగా ఇంటిని ఖాళీ చేయాలని హైకోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణా రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ నివాసం ఎంసిహెచ్‌ఆర్‌డి డిజిగా పనిచేసే వారికి పరిమితమన్నారు. ఈ సంస్థకు రెగ్యులర్ డిజి లేనప్పుడు 2013లో ఐఎఎస్ అధికారి డాక్టర్ రమేష్‌కు కేటాయించారన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ సంస్థకు రెగ్యులర్ డిజిని నియమించిందన్నారు. ఐఎఎస్ అధికారి రమేష్‌కు కుందన్‌బాగ్‌లో ఇంటిని కేటాయించామన్నారు. కాగా ఈ విషయమై వచ్చే సోమవారం కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు రమేష్ న్యాయవాదిని ఆదేశించింది.