రాష్ట్రీయం

‘విదేశాల్లో అనుభవం’ అర్హతలో హేతుబద్ధతేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: అమరావతిలో స్విస్‌చాలెంజ్ విధానం కింద దేశం వెలుపల వౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడంలో అనుభవం ఉన్న కంపెనీలే బిడ్స్‌ను దాఖలు చేయాలనే నిబంధన పెట్టడంలో ఉన్న హేతుబద్ధత ఏంటని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్విస్‌చాలెంజ్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ ఏపి ప్రభుత్వం చేసిన అపీల్‌పై హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ , జస్టిస్ యు దుర్గా ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఏపి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని, సాఫ్ట్‌వేర్, వౌలిక సదుపాయాల అభివృద్ధిలో అనేక భారతీయ కంపెనీలు కీలక పాత్ర వహించాయని, ఎటువంటి షరతులు లేకుండా దేశీయ కంపెనీలను ఎందుకు ఆహ్వానించడం లేదని, దీని వెనక ఉన్న హేతుబద్ధత ఏమిటని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఏజి వాదనలు వినిపిస్తూ అంతర్జాతీయ కంపెనీలు బిడ్స్‌లో పాల్గొని అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టడం వల్ల విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తికనపరుస్తాయన్నారు. ఈ కేసులో పిటిషనర్లుగా ఉన్న ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ సంస్థల తరఫున న్యాయవాది డి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం ఈకేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.