రాష్ట్రీయం

తెలంగాణలో పెరిగిన మద్యం అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నిరుడు సెప్టెంబర్ వరకు మద్యం అమ్మకాలు రూ. 5493 కోట్లు కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ.7061 కోట్లకు చేరింది. దాదాపు నిరుటి కంటే రూ.1600 కోట్లు ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగాయి. నిరుటి కంటే మద్యం అమ్మకాలు ఏ ఏడాది 28.56 శాతం పెరిగాయి. గత ఆబ్కారి ఆర్థిక సంవత్సరం 2015-16 (అక్టోబర్ నుంచి సెప్టెంబర్) వరకు మద్యం అమ్మకాలతో పాటు ఇతరత్రా సమకూరిన ఆదాయం రూ. 12,200 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 2016-17లో రూ.14,161 కోట్లు వస్తుందని బడ్జెట్ ప్రతిపాదనలలో ప్రభుత్వం అంచనా వేసింది. అయితే సెప్టెంబర్ నాటికే అంచనా వేసిన దానికంటే అధికంగా దాదాపు రూ.1600 కోట్లు పెరగడంతో అంచనాలకు మించి ఈ ఆబ్కారి సంవత్సరానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని తాజా అమ్మకాలతో ప్రభుత్వం అంచనా వేస్తోంది.