రాష్ట్రీయం

బాబుకెలా తెలుసు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: కేంద్ర ప్రభుత్వం నల్లధనం వెలికితీతలో భాగంగా ప్రకటించిన ఆదాయం వెల్లడి పథకం 2016 కింద ఇంతవరకు ఐటి శాఖకు ఆదాయం వివరాలు తెలిపిన వారి జాబితాను బహిర్గతం చేయాలని కోరుతూ వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి పదివేల కోట్ల రూపాయలు వెల్లడించారని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారన్నారు. చంద్రబాబుకు ఈ సమాచారం ఎలా తెలిసింది? వివరాలు ఎవరు వెల్లడించారు? ఒక వేళ ఇది వాస్తవమైతే చంద్రబాబు బినామీనే ఒకరు పదివేల కోట్ల రూపాయల నల్లధనాన్ని ఐటి శాఖకు వెల్లడించి ఉంటారన్నారు. చంద్రబాబు కచ్చితంగా సొమ్ము మొత్తాన్ని వెల్లడించారని ఆయన చెప్పారు. ఈ స్కీంపై పరస్పర భిన్నమైన ప్రకటనలు వెలువడుతున్నాయన్నారు. ఆదాయాన్ని వెల్లడిస్తే వారి వివరాలు వెల్లడించబోమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించిందని ఆయన మోదీ దృష్టికి తెచ్చారు. ఇటీవల సిబిడిటి ఒక ప్రకటన చేస్తూ ఆంధ్ర, తెలంగాణ నుంచి 13 వేల కోట్లల నల్లధనం బయటకు వచ్చిందని, ఇందులో ఒకరే రూ.10 వేల కోట్లు చూపించారని పేర్కొందన్నారు. ఇంత విలువైన సమాచారం చంద్రబాబుకు ఎలా తెలిసిందని, ప్రజలు కూడా ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారన్నారు. ఎన్‌సిఏఇఆర్ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ అత్యంత అవినీతి రాష్టమ్రని తేలిందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు సంగతి దేశమంతా తెలుసన్నారు. అవినీతి ముద్రపడినా ఇంకా ముఖ్యమంత్రి పదవిలో అనైతికంగా కొనసాగుతున్నారన్నారు. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆదాయం వెల్లడి పథకం కింద జాబితాలోని వారి పేర్లను ప్రకటించాలని ఆయన కోరారు. అలాగే చంద్రబాబు అవినీతిపై విచారణకు ఆదేశించాలన్నారు.