రాష్ట్రీయం

సమన్వయం లేకుంటే సమస్యలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: రెండున్నరేళ్ల ప్రభుత్వ పాలనకు, మరో ఏడాదిన్నర తర్వాత జరగనున్న స్థానిక సంస్థల పూర్తి స్థాయి ఎన్నికలకు గీటురాయిగా మారిన పలు కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికలపై మిత్రపక్షాలయిన తెదేపా- భాజపా నాయకత్వాలు దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో విడిగా వెళ్లడంవల్ల ఉమ్మడి ప్రత్యర్థి వైకాపా లబ్ధి పొందుతుందనే వాస్తవాన్ని గ్రహించాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బిజెపి సిద్ధమవుతుండటంపై తెదేపా నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
గుంటూరు మార్కెట్ యార్డు, బెజవాడ కనకదుర్గ, అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయాల డైరక్టర్ పదవుల్లో తమకు జరిగిన అన్యాయానికి ఆగ్రహంతో ఉన్న బిజెపి నేతలు.. రానున్న కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని గుంటూరు నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు మీడియా సమక్షంలోనే వెల్లడించారు.
విశాఖ, గుంటూరు, కాకినాడ, కర్నూలు, శ్రీకాకుళం, ఒంగోలుతోపాటు ఐదు మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికల్లో కర్నూలు, శ్రీకాకుళం తప్ప మిగిలిన కార్పొరేషన్లలో భాజపాకు బలమైన క్యాడర్ ఉంది. విశాఖలో రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఎంపి, విష్ణుకుమార్‌రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ 80వ దశకంలోనే కార్పొరేషన్ సాధించిన చరిత్ర బిజెపికి ఉంది. ఇక కాకినాడలో కూడా ఆ పార్టీకి బలమైన క్యాడరే ఉంది. పక్కనే ఉన్న రాజమండ్రిలో కాపువర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు.
గుంటూరులో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు కులాలకు అతీతంగా బలమైన వర్గం ఉంది. అంతకుముందునుంచీ నగరంలో బ్రాహ్మణ, వైశ్య వర్గాలుండే ప్రాంతాల్లో బిజెపికి మంచి పట్టు ఉంది. అక్కడ జూపూడి యజ్ఞనారాయణ 80వ దశకంలోనే బిజెపి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సంఘ్ పరివారం కూడా పెద్ద సంఖ్యలోనే ఉంది. తిరుపతిలో భానుప్రకాశ్‌రెడ్డివంటి బలమైన నేతలతోపాటు, సంఘ్‌పరివారం బలంగా ఉంది.
ఈ నేపథ్యంలో తాము బిజెపిని దూరం చేసుకుంటే దెబ్బతింటామన్న ఆందోళన తెదేపా నేతల్లో వ్యక్తమవుతోంది. గ్రామాల్లో ఆ పార్టీకి బలం లేకపోయినా అర్బన్ ప్రాంతాల్లో ఓటుబ్యాంకు ఉందని, అది గెలిపించడానికి కాకపోయినా ఓడించడానికి పనికి వస్తుందని విశే్లషిస్తున్నారు. దానికితోడు మోదీ ఇమేజ్ పెరుగుతుండటం, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ వర్గాల నేతలు పార్టీలో చేరడం వల్ల బిజెపిని తక్కువగా చేసి చూడటం ఆత్మహత్యాసదృశమేనంటున్నారు. పైగా ఇద్దరూ విడిగా పోటీ చేయటం వల్ల ఉమ్మడి ప్రత్యర్ధి వైకాపా లబ్ధి పొందుతుందని, దానివల్ల బిజెపికి పెద్దగా నష్టం లేకపోయినా అది తమకు భవిష్యత్తులో ప్రమాద సంకేతమేనంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగే అన్నిచోట్లా వైకాపా బలంగా ఉందని, ఈ క్రమంలో బిజెపి ఒంటరిపోరుకు వెళితే, వార్డు స్థాయిలో జరిగే చీలిక వల్ల వైకాపా రాజకీయంగా లబ్ధి పొందుతుందని విశే్లషిస్తున్నారు. వార్డు స్థాయిలో 10-50ఓట్లు కూడా కీలకమేననే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ప్రధానంగా రాజధాని నగరమైన గుంటూరు కార్పొరేషన్‌లో గెలవాలంటే బిజెపి అగ్రనేత కన్నా సహకారం తప్పనిసరి. అక్కడ ఓడితే ఆ చర్చ రాష్ట్రానికి విస్తరిస్తుంది. తమ అధినేతతో ఇతర పార్టీల నుంచి బిజెపిలో చేరిన అగ్రనేతలతో విభేదాలు ఉన్నప్పటికీ, వాటిని పక్కకుపెట్టి కలసి పనిచేయకపోతే మునిగిపోతామని సీనియర్లు విశే్లషిస్తున్నారు.
ఈ చర్చ గత కొద్దికాలం నుంచి పార్టీలో జరుగుతున్న నేపథ్యంలో తెదేపా-్భజపా సమన్వయ కమిటీకి ప్రాధాన్యం ఏర్పడింది. త్వరలో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటుచేసి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగే నగరాలకు సంబంధించిన నేతలనూ ఆహ్వానించడం ద్వారా వారితో దూరం తగ్గించుకుని, ఇద్దరూ కలసి వైసీపీని దెబ్బతీయాలని ఇరుపార్టీల నాయకత్వాలు భావిస్తున్నట్లు సమాచారం.