ఆంధ్రప్రదేశ్‌

మృత్యు తీరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 14: నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు, స్థానికులు సేదదీరే సాగర తీరం ఆర్‌కె బీచ్. దూరం నుంచి చూసే వారికి తెల్లని కెరటాలతో కనువిందు చేస్తుంది. అదే సరదాపడి సముద్రంలో కాలు పెడితే.. కన్ను మూసి తెరిచేలోగా గల్లంతైపోతారు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రతి ఏటా అనేక మంది ఇక్కడి సముద్రంలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడుతున్నారు. తాజాగా శుక్రవారం నలుగురు పిల్లలు ఆర్‌కె బీచ్‌కు వచ్చారు. అంతా 15 ఏళ్ల లోపు వారే. సరదాపడి స్నానానికి దిగారు. మృత్యు కెరటం వారిని లోనికి లాగేసింది. మృత్యువుతో పోరాడి ఇద్దరు మాత్రమే బయటపడ్డారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారు ఇప్పటి వరకూ ప్రాణాలతో బయట పడిన దాఖలాలు లేవు! గడచిన ఐదేళ్లలో విశాఖ సాగర తీరంలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య ఈ విధంగా ఉంది. మిగిలిన బీచ్‌ల్లా కాదు!
దేశ, విదేశాల్లో అనేక బీచులు స్నానానికి అనువుగా ఉంటాయి. కానీ విశాఖ బీచ్‌లో ఎక్కడా కూడా స్నానం చేయడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. యారాడ, ఆర్‌కె బీచ్, రుషికొండ, భీమిలి బీచ్‌ల్లో దిగడం అత్యంత ప్రమాదకరం అన్న విషయాన్ని విశాఖ వాసులే గుర్తించలేకపోతున్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ నుంచి పర్యాటక సీజన్ ఆరంభమవుతుంది. బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వారిలో చాలా మంది బీచ్‌ల్లో స్నానాలకు ఇష్టపడుతుంటారు. ఇలా వెళ్లినవారిలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆర్‌కె బీచ్ మృత్యు కుహరమని తెలిసినా, స్థానికులు కూడా మొండిగా లోపలికి వెళ్లి మృత్యువాతపడుతున్నారు. సాధారణంగా ఇతర బీచ్‌ల్లో ఒడ్డు నుంచి ఒక ఫర్లాంగు దూరం వెళ్లినా, నీరు మోకాలి లోతు వరకూ మాత్రమే వస్తుంది. కానీ విశాఖలో ఏ బీచ్‌లోనైనా అడుగు పెట్టిన వెంటనే అలలు మనుషులను అమాంతంగా ఈడ్చుకుని వెళ్లిపోతున్నాయి. దీనికితోటు ఒడ్డుకు అతి సమీపంలో సముద్రంలో సూది మొనలతో కూడిన పెద్ద బండరాళ్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున కెరటంలో చిక్కుకుని లోపలికి వెళ్లిన వ్యక్తి వెంటనే బండరాళ్లకు గుద్దుకుంటున్నాడు. వెనువెంటనే ప్రాణాలు విడుస్తున్నట్టు సముద్ర అధ్యయనకారులు చెబుతున్నారు. దీనికితోడు అండర్ కరెంట్ అధికంగా ఉండడం వలన గజ ఈతగాళ్లు సైతం వెంటనే సముద్రంలోకి దూకి, ఆపదలో ఉన్న వారిని కాపాడలేకపోతున్నారని తెలుస్తోంది. నాలుగు, ఐదు నెలల కిందట ఆర్‌కె బీచ్‌లో కొద్దిపాటి దూరంలో ఒకే సమయంలో నలుగురు యువకులు మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి తీరాలు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయని చెబుతున్నారు. తీరంపై అవగాహన లేకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని వారు తెలియచేస్తున్నారు. సముద్రంలో గల్లంతై చనిపోయిన వారిలో 15 నుంచి 35 ఏళ్ల లోపువారే ఎక్కువ మంది ఉండడం గమనార్హం.
10 ఏళ్ల కిందటి ప్రతిపాదన.. వాచ్ టవర్స్
విశాఖ ఆర్‌కె బీచ్‌లో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు తీరం వెంబడి వాచ్ టవర్స్ నిర్మించాలని సుమారు పదేళ్ల కిందటే ప్రతిపాదించారు. దీనిపై నుంచి పోలీసులు బైనాక్యులర్స్ ద్వారా చూసి, నీటిలో దిగిన వారిని హెచ్చరించడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు ఇచ్చిన సలహా మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ కార్య రూపం దాల్చలేదు. అలాగే యారాడ, ఆర్‌కె బీచ్, రుషికొండల్లో ఆరుగురు చొప్పున లైఫ్ గార్డ్స్ పనిచేస్తున్నారు. వీరికి జీతాల్లేవు. వీరికి జీతాలు ఎవరు ఇవ్వాలో తెలియక, జివిఎం, పోలీస్, పర్యాటక శాఖలు తప్పించుకు తిరుగుతున్నాయి. వీరు 24/7 పనిచేసే పరిస్థితి లేదు. అలాగే బీచ్ వెంబడి కనీస విద్యుత్ దీపాలు కూడా లేవు. దీనివలన ప్రమాద ప్రదేశం ఏదన్నది గుర్తించలేని పరిస్థితుల్లో పర్యాటకులు ఉన్నారు. బీచ్‌లో ఎక్కడెక్కడ లోతైన ప్రదేశాలు ఉన్నాయో, వాటిని సూచిస్తూ రెడ్ బెలూన్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రతిపాదనకు కూడా మోక్షం లేదు.
తాజాగా ఇద్దరు గల్లంతు
ఆర్‌కె బీచ్‌లో ఇద్దరు పిల్లలు శుక్రవారం గల్లంతయ్యారు. విశాఖ కంచరపాలెం శుభాష్‌నగర్‌కు చెందిన నలుగురు పిల్లలు బీచ్‌కు వచ్చారు. ఇందులో ఆదిత్య, సంతోష్, చైతన్య స్నానానికని బీచ్‌లో దిగారు. వెంటనే పెద్ద కెరటం వచ్చి ముగ్గురిని లోపలికి లాగేసింది. అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు సముద్రంలోకి దూకి చైతన్యను కాపాడగలిగారు. మిగిలిన ఇద్దరు గల్లంతయ్యారు. వీరి కోసం చాలా సేపు గాలించినా ప్రయోజనం కనిపించలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు.

ఫిరాయంపు ఎమ్మెల్యేలకు
మంత్రి పదవులు లేనట్టే

సుప్రీంకోర్టులో టిటిడిపి పిటిషనే కారణం శ అనర్హతపై నిపుణులతో సమాలోచనలు

ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, అక్టోబర్ 14: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కొత్తగా చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో అవకాశం లేనట్లేనని స్పష్టమవుతోంది. తెలంగాణలో టిడిపి అభ్యర్థిగా విజయం సాధించి ఆ తరువాత టిఆర్‌ఎస్‌లో చేరిన ఓ మంత్రి వ్యవహారంపై ఆ రాష్ట్ర టిడిపి నేతలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై తుది తీర్పు వచ్చేంతవరకూ వేచి చూడటమే మంచిదని సిఎంచంద్రబాబునాయుడుకు న్యాయ నిపుణులు సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టిడిపికి చెందిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు మినహా అంతా అధికార పార్టీలో చేరారు. ఆ తరువాత పార్టీ శాసనసభాపక్ష నేతగా టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు సభాపతికి లేఖ ఇచ్చారు. దాన్ని ఆమోదించడంతో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం చెల్లదని, అంతేగాక పార్టీలో చేరకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా చేరిక తరువాత విలీనలేఖ ఇచ్చారని టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పిటిషన్ వేశారు. విలీన ప్రక్రియ కంటే ముందే తమ పార్టీ నుంచి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి కట్టబెట్టారని, వీరంతా వారి పదవులకు అనర్హులని ఆయన సుప్రీంలో వాదిస్తున్న విషయం విదితమే. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైకాపా నుంచి టిడిపిలో చేరిన వారికి మంత్రి పదవి ఇస్తే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయన్న కారణంగా మంత్రివర్గంలోకి ఇప్పట్లో చేర్చుకునే అవకాశాలు లేవని పార్టీ నేతలకు సంకేతాలు అందాయి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఆ రాష్ట్ర సభాపతి తన నిర్ణయాన్ని నెల రోజుల్లోగా వెల్లడించాలని సుప్రీం కోర్టు సూచించడంతో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించడానికి సిద్ధపడుతున్నారని వైకాపా నేతలు ఆశాభావంతో ఉన్నారు. అధికార పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా మళ్లీ విజయం సాధించే అవకాశాలు ఉండటంతో వేటుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని వారు ధీమాతో ఉన్నారు. ఏపిలో ఆ పరిస్థితి లేకపోవడంతో వేటుకు వెనుకడుగు వేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. తెలంగాణలో నిర్ణయం తీసుకుంటే ఇక్కడ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని, దీనిపై ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తోందని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఫిరాయింపుల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించడమే మంచిదన్న నిపుణుల సలహాపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చర్చించుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ వైకాపా సభ్యులు(్ఫరాయింపు ఎమ్మెల్యేలు) లేకుండా చేయడం కంటే కాస్త ఆలస్యమైనా వారితో కలిపే విస్తరిస్తే మంచిదని సిఎం ఆలోచిస్తున్నట్లు టిడిపి నేతల ద్వారా తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల్లో ఫిరాయింపులపై తలెత్తిన సందిగ్ధం కారణంగా మంత్రి పదవి దక్కించుకోవాలని ఆశిస్తున్న కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు వైకాపా నుంచి టిడిపిలో చేరిన మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ప్రొటోకాల్ పాటించాల్సిందే

అధికారులకు ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి ఆదేశం

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 14: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులపై అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయ వేదికగా ప్రివిలేజెస్ కమిటీ సమావేశం నిలవాలని అధ్యక్షుడు గొల్లపల్లి సూర్యారావు స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో కృష్ణా జిల్లా అధికారులతో అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రభుత్వ పథకాల అమలుతీరు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాల్సిన అవసరముందని చెప్పారు. ప్రొటోకాల్, ప్రివిలేజ్ విధానాలను అధికారులు సమర్ధవంతంగా నిర్వర్తించాల్సి వుంటుందన్నారు.
రాజధానిలో ప్రధాన పాత్రను గత రెండున్నరేళ్లుగా కృష్ణా జిల్లా అధికారులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. రెండున్నరేళ్లలో రెండు ఫిర్యాదులు మాత్రమే రావడం అధికారులకు ప్రజాప్రతినిధులపై ఉన్న నిబద్ధతను చాటుతోందన్నారు. ఏ ఒక్క ఫిర్యాదు రాకుండా గౌరవ సభ్యులతో సమన్వయం చేసుకోవడం ఎంతో ముఖ్యమని సూర్యారావు సూచించారు. జిల్లాలో పేదల కోసం 11150 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇప్పటివరకు 10వేల ఇళ్లకు మంజూరు ఉత్తర్వులను జారీ చేశామని హౌసింగ్ పీడీ శరత్‌బాబు కమిటీకి తెలిపారు. మరో 350 ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం కొత్తగా అనుమతి ఇచ్చిందన్నారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం కింద రూ. లక్షా 50వేలు, ప్రధాన మంత్రి గృహ యోజన కింద రూ.2 లక్షలు లబ్ధిదారులకు అందించనున్నామన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రాజు మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల్లో జరిగే సమీక్ష సమావేశాలకు గౌరవ ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, ముందస్తు సమాచారం అందించాలని కోరారు. శాసనసభ్యుడు టి శ్రావణ్‌కుమర్ మాట్లాడుతూ గౌరవ ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై ఫిర్యాదు చేసిన సందర్భంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు.