రాష్ట్రీయం

అక్రమ మైనింగ్‌పై నిరంతర నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: దేశంలో అక్రమ మైనింగ్‌పై నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర విద్యుత్తు, బొగ్గు, గనుల శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. గనుల తవ్వకాల నిఘా వ్యవస్థను (ఎంఎస్‌ఎస్)ను శనివారం ఆయన ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎంఎస్‌ఎస్ ఉపగ్రహ ఆధారితంగా పనిచేస్తుందన్నారు.
గనుల తవ్వకాల్లో అక్రమాలను ఆటోమెటిక్‌గా రిమోట్ సెన్సింగ్ డిటెక్షన్ టెక్నాలజీ సాయంతో అడ్డుకోవడం ఈ వ్యవస్థ ప్రత్యేకత అన్నారు. దేశంలో చట్టవ్యతిరేకంగా కొనసాగుతున్న గనుల తవ్వకాల కార్యకలాపాలను నిరోధించేందుకు అంతరిక్ష విజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎస్ ప్రపంచంలోనే అంతరిక్ష సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న మొట్టమొదటి నిఘా వ్యవస్థలలో ఒకటన్నారు.
భారత్‌లో ప్రధాన ఖనిజాలకు సంబంధించి మొత్తం 3843 మైనింగ్ లీజులు అమలవుతున్నాయని పియూష్ తెలిపారు. డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పూర్తి చేసి ఉపయోగించుకుంటాయన్నారు.