రాష్ట్రీయం

ఎక్కడి వర్షం నీళ్లు అక్కడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: ఎక్కడ కురిసిన వర్షం నీటిని అక్కడే ఇంకింపజేసి వ్యవసాయాన్ని పెంపొందించి, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని సాగు నీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ టి.హనుమంత రావు అన్నారు. అలా చేస్తే ఏడాదిలో మూడు పంటలు వేసుకోవచ్చని అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి స్మారక ట్రస్టు ‘అందరికీ నీరు- నీటి యుద్ధాలు వద్దు’ అనే అంశంపై శనివారం ‘సెస్’లో నిర్వహించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి స్మారకోపన్యాసం సభలో ఆయన ప్రధానోపన్యాసం చేశారు. డాక్టర్ చెన్నారెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర రావు అధ్యక్షత వహించారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి, ఎంపీలు కొండా విశే్వశ్వర్ రెడ్డి, నంది ఎల్లయ్య, మాజీ ఎంపి మల్లు రవి ప్రభృతులు వేదికపై కాకుండా సభికుల మధ్య కూర్చున్నారు.
ఈ సందర్భంగా టి.హనుమంత రావు మాట్లాడుతూ వర్షం నీటిని ఎలా ఒడిసి పట్టుకోవచ్చో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే తాను సలహాలు ఇస్తూ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని హనుమంత రావు తెలిపారు. వాటర్ షెడ్లలో అవలంబిస్తున్న సాంకేతిక పద్ధతుల ద్వారా సత్ఫలితాలు రానందున కొత్త పద్ధతులను 1996 సంవత్సరంలో కనుక్కున్నట్లు ఆయన చెప్పారు. దీనిని చైనాలోని నాన్పి ప్రాజెక్టు, హెబాయి ప్రావిన్స్‌లో ప్రవేశపెట్టగా మంచి ఫలితాలు ఇచ్చాయని, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (2000-04) మధ్య కాలంలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజస్థాన్‌లోని సుమారు 4 వేల వాటర్ షెడ్ గ్రామాలలో (2014-16) చేపట్టి విజయం సాధించినట్లు వివరించారు. సిమెంట్ చెక్ డ్యాములు, రాక్ ఫిల్ డ్యాములకు స్వస్తి పలికి 10 రెట్లు మేలు చేసే మట్టి పనులు, వృక్ష సంబంధమైన పనులు చేపట్టవచ్చని అన్నారు. అలా చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుందని, ఎండిపోయిన బావులలో నీరు సమృద్ధిగా చేరుతుందని చెప్పారు. రాజస్థాన్‌లో ఒక గొట్టపు బావి నుంచి నీరు ఉబికి వస్తున్న దృశ్యాన్ని ఆయన చూపించారు. మెదక్ జిల్లా గొట్టిగారి పల్లిలో, కర్నూలు, చిత్తూరులో కొన్ని గ్రామాల్లో చేపట్టిన ‘చతుర్విద జల ప్రక్రియ’ విజయవంతమైందని, మాయామంత్రాలు ఏమీ లేవని అన్నారు. తాను చెప్పిన పద్ధతుల్లో చేస్తే రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల అవసరం ఉండదని, వర్షాధార పంటలన్నింటికీ సంవత్సరం పొడుగునా నీరు ఇవ్వవచ్చని, రైతులు రెండు కాదు మూడు పంటలు వేసుకోవచ్చని ఆయన తెలిపారు. వ్యవసాయం చేసే భూముల్లో ఎక్కడ కురిసిన వర్షం నీటిని అక్కడే ఇంకింపజేసి, పొలం నుంచి పొర్లే నీటిని స్థానిక చెరువుల్లో నింపితే నదులలో వరదలు ఉండవని అన్నారు. ఈ పరిజ్ఞానంతో ఎకరాకు ఐదు వేల రూపాయల ఖర్చు అవుతుందని, భారీ ప్రాజెక్టుల ద్వారా మూడు లక్షలు అవుతుందని హనుమంత రావు తెలిపారు.
ప్రజలను చైతన్యపరుస్తాం: మర్రి
మర్రి శశిధర్ రెడ్డి ప్రసంగిస్తూ వర్షం నీటిని ఒడిసి పట్టుకునేందుకు రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేస్తామని అన్నారు. రాజస్థాన్ ప్రజలు హనుమంత రావును దేవునిలా చూస్తున్నారని ఆయన చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కొత్త పద్ధతుల గురించి దేశ వ్యాప్తంగా తెలియజేయాలని సభికుల్లో కొందరు సూచించారు.

‘అందరికీ నీరు- నీటి యుద్ధాలు వద్దు’ అంశంపై
శనివారం హైదరాబాద్‌లోని ‘సెస్’లో నిర్వహించిన
మర్రి చెన్నారెడ్డి స్మారకోపన్యాసం సభలో ప్రసంగిస్తున్న
రిటైర్డ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ టి.హనుమంత రావు (పై చిత్రం).
ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న సురేష్‌రెడ్డి, జైపాల్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కొండా విశే్వశ్వర రెడ్డి తదితరులు