ఆంధ్రప్రదేశ్‌

దోమలపై దండయాత్ర దిగ్విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: పరిసరాల పరిశుభ్రత - దోమలపై దండయాత్ర, వనం - మనం తదితర కార్యక్రమాలు విజయవంతం కావడం వల్లే గడిచిన 5 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంటువ్యాధులు గణనీయంగా తగ్గాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి విద్యాశాఖ, వైద్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి 1,389 కేసుల నుంచి 71కి, మలేరియా 15,795 నుంచి 324కు తగ్గిందని ముఖ్యమంత్రి సోదాహరణంగా వివరించారు. ఇదే స్ఫూర్తితో అందరూ సమన్వయంగా పని చేస్తే అతిత్వరలోనే రాష్ట్రం నుంచి అంటువ్యాధులను సమూలంగా నిర్మూలించవచ్చన్నారు. వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ 13 జిల్లాల్లో పట్టణ జనాభా లక్ష మందిని కవర్ చేసేలా 126 బృందాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క బృందానికి ఒక వాహనం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో వినియోగించామన్నారు. ఇప్పటి వరకు 65,74,972 జనావాసాలను కవర్ చేశామన్నారు.
దోమల ఉత్పత్తి కేంద్రాలు 7,19,065 ప్రాంతాలను గుర్తించి మున్సిపల్, పంచాయతీరాజ్ సిబ్బంది సహకారంతో యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు. గ్రామాలు, వార్డుల్లో తాగునీటి క్లోరినేషన్‌లో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనివల్ల అందరికీ ఆరోగ్యంతోపాటు దాదాపు 13వేల మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పించినట్లు అవుతుందన్నారు. వనం - మనం కింద నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ప్రతి శనివారం శానిటేషన్ డ్రైవ్ ముమ్మరంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామం, వార్డులో యాంటీ లార్వా ఆపరేషన్లు ముమ్మరంగా జరపాలన్నారు. సురక్షితమైన మంచినీరు అందరికీ అందేలా చూడాలన్నారు. దోమల రహితంగా అన్ని గ్రామాలు, వార్డులు రూపొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఓడిఎఫ్‌గా రూపొందిన గ్రామాలు, పట్టణాలన్నీ దోమల రహితంగా రూపొందాలన్నారు. మస్కిటో ఫ్రీ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్ రూపొందాలన్నదే తన సంకల్పంగా తెలిపారు. అంధరూ శారీరక వ్యాయామం చేసేలా, ఆహారపు అలవాట్లు మార్చుకునేలా ప్రజలను చైతన్యపరిచే బాధ్యత విద్యా, వైద్యశాఖలపైనే ఉందన్నారు. దోమలపై దండయాత్ర కార్యక్రమంలో బాగా పని చేసిన వారందరికీ వచ్చేవారం అవార్డులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

నకిలీ పురుగుమందులపై కనె్నర్ర

అధికారులను దిగ్బంధించిన రైతులు ఖ ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక

తర్లుపాడు, అక్టోబర్ 15: నకిలీ పురుగుమందులతో నష్టపోయామని ప్రకాశం జిల్లాలో రైతులు కనె్నర్ర చేశారు. నిరోధించాల్సిన అధికారులను దిగ్భందం చేసి సంబంధిత డీలర్లపై కేసులు నమోదు చేయాలని, జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అదే పురుగుమందు తాగి కుటుంబపాది ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిస్తూ పురుగుమందు డబ్బాలతో శనివారం రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని మీర్జాపేట గ్రామానికి చెందిన కొంతమంది మిర్చి పంటను సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకొని మిర్చి పంటకు జీవం పోశారు. తదుపరి తర్లుపాడులోని సాయిశ్రీనివాస ఏజెన్సీ దుకాణంలో రీజంట్ కర్జట్ ఎం-8 పురుగుమందులను కొనుగోలు చేసి ఆ పంటపై పిచికారి చేశారు. ఆ మందులను పిచికారి చేసినప్పటి నుంచి మొక్కలు ఎండుముఖంపట్టి ఆకులు రాలిపోయి ఒట్టిపోయాయి. కాసిన మిరపకాయలు కూడా నల్లబారి నేలరాలాయి. దీనితో దుకాణం యజమాని వద్దకు వెళ్ళి ప్రశ్నించగా తమకు సంబంధం లేదంటూ సమాధానం ఇవ్వడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో వ్యవసాయ అధికారులను ఆశ్రయించారు. మార్కాపురం ఎడిఎ సుదర్శన్‌రాజు, క్వాలిటీకంట్రోల్ ఎఓ రంగలక్ష్మీ శుక్రవారం ఆ పంటను పరిశీలించి రైతుకు తగిన న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. శనివారం ఏరువాక శాస్తవ్రేత్త జి రమేష్, సస్యరక్షణ ఎడిఎ రత్నప్రసాద్, ఎడిఎ సుదర్శన్‌రాజు, ఎఓ బుజ్జిబాయిలు ఆ పంటను పరిశీలించారు. శాస్తవ్రేత్త జి రమేష్ మాట్లాడుతూ రైతు ఉపయోగించిన పురుగుమందుల శ్యాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి పరిశీలిస్తామని తెలిపారు. దీనితో ఆగ్రహించిన రైతులు శ్యాంపిల్స్ తీసుకొని మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటంటూ, నష్టపరిహారం విషయంలో భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అధికారులను దిగ్భందించారు. శుక్రవారం ఎడిఎ సుదర్శన్‌రాజు దృష్టికి డీలర్ దుకాణం వారు అధిక ధరలకు పురుగుమందులను అమ్ముతున్నారని, రశీదులు ఇవ్వడం లేదని, నకిలీ పురుగుమందులు విక్రయిస్తున్నారని లిఖితపూర్వక ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నిస్తూ నిలదీశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరిగేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు. పంట నష్టపరిహారం చెల్లించకుంటే ఇదే పురుగుమందును తాగి కుటుంబసమేతంగా ఆత్మహత్యలకు పాల్పడుతామని హెచ్చరిస్తూ పురుగుమందుడబ్బాలతో రోడ్డుపై బైఠాయించారు. రెండుగంటలపాటు రైతులందరూ ఐక్యమై ఆందోళనకు పూనుకున్నారు.