రాష్ట్రీయం

21న టిడిపిలోకి వేదవ్యాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 16: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వైఖరికి నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేసిన కృష్ణా జిల్లా సీనియర్ నేత, మాజీ ఉప సభాపతి బూరగడ్డ వేదవ్యాస్ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. కొంతకాలంగా వైకాపా అధినాయకత్వంపై గుర్రుగా ఉన్న ఆయన శనివారం ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబును కలిసి ఈ నెల 21న టిడిపిలో చేరనున్నట్లు తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన వేదవ్యాస్ గత కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు శాసనసభ్యునిగా, శాసనసభ ఉప సభాపతిగా, రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనకుంటూ ఒక ముద్ర వేసుకున్న ఆయన కొంతకాలంగా రాజకీయంగా తెరమరుగయ్యారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పెడన నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తరువాత కొంతకాలం పెడన నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో భేదాభిప్రాయాలు రావటంతో ఇన్‌ఛార్జి పదవి పోయింది. పార్టీలో తనకంటూ ఒక గుర్తింపు లేకపోవటంతో మనోవేదనకు గురైన వేదవ్యాస్ ఇక ఇమడలేనంటూ శనివారం జరిగిన అభిమానులు, కార్యకర్తల సమావేశంలో వైకాపాకు రాజీనామా చేశారు. వేదవ్యాస్ తనయుడు కిషన్‌తేజ్‌కు, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్‌కు మధ్య స్నేహం ఉన్న నేపథ్యంలో వ్యాస్ టిడిపి గూటికి చేరడం సుగమమైంది.

చిత్రం.. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేస్తున్న వేదవ్యాస్