రాష్ట్రీయం

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ బేగంపేట, అక్టోబర్ 16: కుటుంబ కలహాలు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బలితీసుకున్నాయి. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక సికిందరాబాద్‌లోని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగుట్టకు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శే్వత హైటెక్ సిటీలోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. నగరంలోని చిక్కడపల్లికి చెందిన శే్వతకు నల్లగుట్టకు చెందిన శ్రీకాంత్‌చారితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. శ్రీకాంత్‌చారి నల్లగుట్టలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ, టిఆర్‌ఎస్ పార్టీ నేతగా కొనసాగుతున్నాడు. తరచూ భార్యతో గొడవ పడుతుండే శ్రీకాంత్‌చారి శనివారం రాత్రి అతిగా మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. దీంతో శే్వత ఆదివారం తెల్లవారు జామున ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని రాంగోపాల్‌పేట ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. శే్వత ఆత్మహత్య చేసుకోలేదని, భర్త శ్రీకాంత్, అత్తమామలే చంపారంటూ శే్వత తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురును బలిగొన్న భర్త, అత్తమామలను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు.

చిత్రం.. నల్లగుట్టకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శే్వత మృతదేహం