రాష్ట్రీయం

ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: పోలీస్ అంటే ఒక రకమైన అభిప్రాయం ఏర్పడి, ప్రజలకు పోలీసులకు మధ్య గత కొనే్నళ్లనుంచి అంతరాయం ఏర్పడిందని పేర్కొంటూ, ప్రస్తుతం అది తప్పని నిరూపిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలకు దగ్గరైన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖను గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రశంసించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం మంచిదని, ఈ విధానానే్న తాను కోరుకుంటున్నానని ఆయన పునరుద్ఘాటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఫస్ట్ ఇండియన్ పోలీస్ మెమోరియల్ మారథాన్ రన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ గత రెండున్నరేళ్లుగా అనేక కార్యక్రమాలను చేపట్టి పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థకు నాంది పలికిందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను దేశమంతటా వ్యాపించే దిశగా తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇలాం టి పీపుల్స్ ఫ్రెండ్లీ విధానంతో ఎన్నో సమస్యలు పరిష్కరించబడుతున్నాయని, డివిజనల్, సబ్ డివిజనల్ కేంద్రాల్లో కూడా ఈ పాలసీని అమలు చేయాలని గవర్నర్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథి సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమి డైరెక్టర్ అరుణా బహుగుణ మాట్లాడుతూ ఇలాంటి పోలీస్ రన్ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా చేపట్టాలని సూచించారు. పరుగు మనిషి శరీర, ఆరోగ్య పరిపుష్టికి ఎంతో దోహదపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా పోలీస్ అమరవీరుల త్యాగాన్ని మరచిపోకుండా ఉండేందుకు ప్రజలను భాగస్వాములను చేస్తూ పోలీస్ స్మారక పరుగును విజయవంతం చేశామన్నారు. ఎవరు కూడా ఇక్కడికి బలవంతంగా రాలేదని, పోలీస్ శాఖపై ఉన్న అభిమానం, ప్రేమతో వచ్చారన్నారు. 10,5,2 కిలో మీటర్ల పరుగులో సుమారు ఆరువేల మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు. కేంద్ర పోలీస్ బలగాలు, రాష్ట్ర పోలీస్ విభాగాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనకు మంచి స్పందన లభిస్తోందని, ఈ ఎక్స్‌పో సోమవారం కూడా ఉంటుందని డిజిపి తెలిపారు. ప్రజల భద్రత, వారి రక్షణ కోసం పోలీసులు చేస్తున్న పనితీరును ఈ ఎక్స్‌పో తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, పలువురు ఐపిఎస్ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఆదివారం జరిగిన ఫస్ట్ ఇండియన్ పోలీస్ మెమోరియల్ రన్‌లో
విద్యార్థులతో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్. డిజిపి అనురాగ్ శర్మ తదితరులు