ఆంధ్రప్రదేశ్‌

నిరుద్యోగులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయో పరిమితిని రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గత కొనే్నళ్లుగా జరగకపోవడం, లక్షలాది అభ్యర్ధులకు వయోపరిమితి దాటిపోవడంతో వారంతా వయోపరిమితి పెంచాలని గత కొంతకాలంగా కోరుతున్నారు. వారి అభ్యర్థనను మన్నిస్తూ అభ్యర్థుల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2014 సెప్టెంబర్ 23న జీవో 295 జారీ చేసింది. ఈ వయో పరిమితి పెంపు జీవో గడువు 2016 సెప్టెంబర్ 30తో ముగిసింది. ఎపిపిఎస్సీ ద్వారా 4009 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించినా, కేవలం ఎఇఇ పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు వచ్చాయి. ఇంకా వేలాది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావల్సి ఉంది. వయోపరిమితి పొడిగింపు గడువు ముగియడంతో నిరుద్యోగ యువత అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో ప్రభుత్వానికి వయోపరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోవల్సిందిగా ఎపిపిఎస్‌సి లేఖ రాసింది. ఈలేఖపై స్పందించిన ప్రభుత్వం మరో ఏడాది పాటు వయోపరిమితి పెంపు అమలు అయ్యేలా ఉత్తర్వులను జారీ చేసింది.