తెలంగాణ

వరంగల్‌లో సిబిఎస్‌ఇ పరీక్షా కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 18: వరంగల్ నగరంలో సిబిఎస్‌ఇ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు వచ్చే జనవరిలో జరిగే 2016-17 విద్యాసంవత్సరం పరీక్షలు వరంగల్ నగరంలో ఏర్పాటుచేసే కొత్త సెంటర్ నుంచి నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం హైద్రాబాద్‌లోనే సిబిఎస్‌ఇ పరీక్షా కేంద్రం ఉండటంతో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఇబ్బందులు పడవలసి వచ్చేది. అప్పట్లోనే వరంగల్ కేంద్రంగా మరో సిబిఎస్‌ఇ పరీక్షా కేంద్రం ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని అప్పటి ముఖ్యమంత్రులకు ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాలు వినతులు ఇచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయ పరిశోధకుల సంఘం, వివిధ టీచింగ్, నాన్ టీచింగ్ సంఘాలు వరంగల్ కేంద్రంగా సిబిఎస్‌ఇ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నించాలని ఎంపి వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందచేయటం, ఆయన ఢిల్లీలోని కేంద్ర మానవవనరుల మంత్రిని, సిబిఎస్‌ఇ ఉన్నతాధికారులను కలుసుకుని సిబిఎస్‌ఇ పరీక్షా కేంద్రం ఏర్పాటుపై ఒత్తిడి తీసుకవచ్చిన ఫలితంగా కొత్త పరీక్షాకేంద్రం ఏర్పాటుకు సిబిఎస్‌ఇ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసారు. దీనివల్ల ఉత్తర తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలతోపాటు నల్గొండ జిల్లాల విద్యార్థులు వరంగల్ కేంద్రంలో సిబిఎస్‌ఇ పరీక్షలు రాసేందుకు అవకాశం ఏర్పడింది.