రాష్ట్రీయం

అందరి చూపూ మనవైపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 20: ప్రపంచమంతా భారత వైపు చూస్తోందని, భారత్ ఆంధ్ర ప్రదేశ్‌వైపే దృష్టి పెట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచాన్ని జయించే శక్తి కలిగిన యువశక్తి ఏపీలోనే ఎక్కువగా ఉందన్నారు. వచ్చే ఏడాది జూన్ రెండో తేదీ నాటికి రాష్ట్రంలో అందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో 600 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (పెట్రోలియం యూనివర్శిటీ)కి చంద్రబాబు, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి గురువారం శంకుస్థాపన చేశారు. దేశంలోనే తొలి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి ప్రధాన్ ప్రధాన మంత్రి ఉజ్వల పథకాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబు విశాఖలోని హెచ్‌పిసిఎల్‌ను 24 వేల కోట్ల రూపాయలతో విస్తరించనున్నారని చెప్పారు. అలాగే 38 వేల కోట్ల రూపాయలతో విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. గోదావరి, కెజి బేసిన్‌లో గ్యాస్, నిక్షేపాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, త్వరలోనే రాజమండ్రి నుంచి శ్రీకాకుళం వరకూ గ్యాస్, పెట్రోలు, డీజిల్‌ను పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తామని వెల్లడించారు. సబ్బవరం ఎడ్యుకేషన్ హబ్‌గా రూపుదిద్దుకోనుందన్నారు.
నాలుగేళ్లలో ఉద్యోగాలు
పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ చంద్రబాబు, మోదీపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటామని అన్నారు. ఇందులో భాగంగానే 600 కోట్లతో పెట్రోలియం యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తను కెనడా, సౌది, సింగపూర్ తదితర దేశాల్లో పర్యటించినప్పుడు అక్కడ కీలక పదవుల్లో ఏపికి చెందిన యువకులే ఉన్నారని గుర్తు చేశారు. వర్శిటీలో విద్యతోపాటు, స్కిల్ డవలప్‌మెంట్ శిక్షణ కూడా నాలుగేళ్లలో విద్యార్థులు పూర్తి చేస్తారని, ఆఖరి సంవత్సరం పూర్తి చేసేలోగా ఓఎన్‌జిసి, గెయిల్, హెచ్‌పిసిఎల్ వంటి కంపెనీల్లో ఉద్యోగ నియామకపత్రాలు కూడా ఇవ్వనున్నామని ప్రదాన్ చెప్పారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద దేశంలో 90 శాతం మందికి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశామని, వచ్చే మూడేళ్లలో మిగిలిన పది శాతం మందికి కూడా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ఆయన చెప్పారు. అందరికీ గ్యాస్ అందుబాటులో ఉంటే, కిరోసిన్ అవసరం ఉండదని, దీనివలన నాలుగు వేల కోట్ల సబ్సిడీ ఆదా అవుతుందని ఆయన చెప్పారు. 2016-17 నాటికి విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి డిసెంబర్‌లో శంకుస్థాపన చేస్తామన్నారు.
మాది చేతల ప్రభుత్వం
తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.గ్రామా గ్రామానికి పక్కా రోడ్లు వేస్తున్నామని, సమాచార వ్యవస్థను, విమాన, విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దేశంలోని దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలకు తొలి గ్యాస్ సిలెండర్‌ను ఉచితంగా ఇవ్వనున్నామని ఆయన చెప్పారు. కాగా, పాకిస్థాన్ కుట్రలను, కుతంత్రాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందని, దీన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునేవారు ప్రజా వ్యతిరేకులని అన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బు పాచిపోయిందని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలను వెంకయ్య ఖండించారు. 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే, రహస్యంగా దాచిపెట్టిన డబ్బంతా పాచిపోతుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కొంతమంది మహిళలకు గ్యాస్ సిలెండర్లను ముఖ్యమంత్రి, మంత్రులు పంపిణీ చేశారు.

చిత్రం..లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య