రాష్ట్రీయం

మరో సిలికాన్ వ్యాలీగా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 20: అమెరికాలోని సిలికాన్ వ్యాలీగా నవ్యాంధ్ర రూపుదిద్దుకోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమెరికాకు చెందిన ఐటి సెర్వ్ అలయెన్స్ మెంబర్ కంపెనీస్ గ్రూప్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎనిమిది ఐటి కంపెనీలను గురువారం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన ఇప్పటికే విశాఖ కేంద్రంగా ఐటి పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని, ఇటువంటి కంపెనీలు మరిన్ని తరలివచ్చే అవకాశం ఉందన్నారు. 500 కంపెనీల గ్రూప్‌లో ఎనిమిది కంపెనీలు విశాఖలో ప్రారంభం కాగా 300 మందికి ఉద్యోగావకాశాలు లభించాయన్నారు. మరో 32 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. వీటి వల్ల మరో 2000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయనని పేర్కొన్నారు. ఒక్కో కంపెనీ 10 నుంచి 30 కోట్ల టర్నోవర్ సాధిస్తూ ప్రగతి దిశగా నడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఐటి కంపెనీలకు ప్రభుత్వ పరంగా చక్కటి ప్రోత్సాహానిస్తున్నామని, ఎంఎస్‌ఎంఇలకు రూ.1.5 లక్షల సబ్సిడీని అందిస్తున్నట్టు తెలిపారు. మైక్రోసాఫ్ట్ 11వ అభివృద్ధి కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇ-ప్రగతిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో ఉందని, దీని వల్ల రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఐటి కంపెనీలకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ఏయే రంగాల్లో ఐటిని ఉపయోగించుకోవచ్చో అధ్యయనం చేయడంతో పాటు నూతన ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.విశాఖ నగరం ఐటి కంపెనీల ఏర్పాటుకు అనుకూలమని, ఇక్కడ సహజ వాతావరణం కంపెనీలకు, ఉద్యోగులకు అత్యంత సురక్షితమని పేర్కొన్నారు.