రాష్ట్రీయం

ఫీజులో రామచంద్రా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: సీఎం కెసిఆర్ మాటల్లో దేశంలో గుజరాత్ తర్వాత రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ. అయినా విద్యార్థులకు రెండువేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేని పరిస్థితి. 150 కోట్ల మెస్ బకాయిలు చెల్లించలేని దుస్థితి. రాష్ట్రంలో 14 లక్షల బడుగు బలహీన విద్యార్థులు అవస్థ పడుతున్నారు. ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ఇప్పటివరకూ నెరవేరకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. ఫీజు చెల్లింపు అంశంలో సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా శుక్రవారం నుంచి కాంగ్రెస్, రేపటి నుంచి తెతెదేపా భారీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ వెయ్యి కోట్ల రూపాయలు ప్రైవేటు కాలేజీలకు ఫీజు బకాయిల చెల్లింపుకింద జమ చేశారు. అయితే 2014-2015, 2015-2016 ఆర్థిక సంవత్సరాలకు మాత్రం 2,090 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు విడుదల చేయక పోవటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫీజులు చెల్లించకపోతే తాము కాలేజీలు నడపటం కష్టమని, చదువులు చెప్పలేమని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఫీజులు చెల్లించలేకపోతే కాలేజీకి రావద్దని విద్యార్థులకు నిర్మొహమాటంగా చెబుతున్నాయి. మెజారిటీ కాలేజీలు ఫీజు రీఇంబర్స్‌మెంటుపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. అందులో ఉద్యోగాలు చేసే ప్యూన్ల నుంచి ఫ్యాకల్టీల వరకూ నెలల తరబడి జీతాలు అందుకోని దుస్థితిలో ఉన్నారు. కారణం ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు ఫీజు బకాయిలు ఇవ్వకపోవటమే. ఈ ఆందోళనలకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, త్వరలో మొత్తం బకాయిలు చెల్లించేస్తామని అసెంబ్లీలోనే
హామీ ఇచ్చారు. కానీ అది ఇప్పటివరకూ నెరవేరింది లేదు. మరోవైపు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో జరిపిన చర్చల్లో.. ముందు 200 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నా దానికీ దిక్కులేదు. ఇంకోవైపు ఉస్మానియా యూనివర్శిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయగా, ప్రైవేటు కాలేజీలు ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించనిదే పరీక్షల ఫీజులు కట్టించుకోమని స్పష్టం చేయడంతో విద్యార్థులు ఇంకా అయోమయంలో ఉన్నారు. ఇంకోవైపు యూనివర్శిటీలో మెస్ బకాయిలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తం 150 కోట్ల మెస్ బకాయిలు పెండింగ్‌లో ఉండగా, అందులో ఒక్క ఉస్మానియా వర్శిటీకే 130 కోట్లు గత రెండున్నరేళ్ల నుంచి చెల్లించాల్సి ఉంది.
ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ కోసం రోడ్డెక్కేందుకు విద్యార్ధి సంఘాలు భారీ ఉద్యమానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.అందులో భాగంగా శుక్రవారం శంషాబాద్‌లో టిపిసిసి చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యాన పీసీసీ భారీ సభ నిర్వహించనుంది. అక్కడే విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకోనుంది. టీఎస్‌టిడిపి శనివారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించనుంది. ఇప్పటికే ఏబివిపి, టిఎన్‌ఎస్‌ఎఫ్ వంటి సంఘాలు పలుదశల్లో ఆందోళనలు చేసిన ఫలితంగానే ప్రభుత్వం వెయ్యి కోట్లు విడుదల చేసింది. మరో రెండు వేల కోట్ల పూర్తి బకాయిల విడుదల కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు.
‘ ఈ ప్రభుత్వం రెండేళ్లలో లక్షకోట్లు అప్పు చేసింది. అవన్నీ ఎటు పోయాయి? కేజీటుపీజీ ఏమైంది? టీచర్ల నియామకాలేవీ? అసెంబ్లీలో కేసీఆర్ బకాయిలు చెల్లిస్తామన్న హామీ ఏమైంది. దీనిపై విద్యార్థులు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులను వారి నియోజకవర్గాల్లో నిలదీయాలి. మీ కుటుంబం తప్ప మా విద్యార్ధులు బంగారు తెలంగాణలో భాగం కాదా? ఆ ఫలాలన్నీ మీ కుటుంబానికే దక్కాలా అని నిలదీస్తాం. శనివారం ఫీజు చెల్లింపుపై భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామ’ని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నేత చిలుకా మదుసూదనరెడ్డి స్పష్టం చేశారు.