రాష్ట్రీయం

పెళ్లిపీటలపై వరుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, అక్టోబర్ 20: కళకళలాడుతున్న పెళ్లి మంటపంలో నెత్తురు చిందింది. పసుపు బట్టల్లో ఉన్న పెళ్లి కుమారుణ్ని కత్తులతో దారుణంగా నరికి చంపారు. గుడిలో జరుగుతున్న పెళ్లిలో రక్తం పారించిన పెళ్లి కూతురు బంధువుల దాష్టీకానికి నిలువెత్తు దేవుడూ స్థాణువులా చూస్తూ ఉండిపోయాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండి కాలనీలోని తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్నేహితులు, బంధుగణం అంతా చూస్తుండగానే జరిగిన ఈ దారుణ హత్య స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసుల కథనం ప్రకారం...కరీంనగర్ మండలం రేకుర్తిలోని విజయపురి కాలనీకి చెందిన అనిల్ (25), అదే కాలనీకి చెందిన వౌనిక (19) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారైనా వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో గత కొంతకాలంగా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో పెళ్లికూతురు తరపువారు అనిల్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అప్పటికి వౌనిక మైనర్ కావడంతో పోలీసులు అనిల్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనిల్ అరెస్టయి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. కాగా వౌనిక రెండు మాసాల క్రితం మేజర్ అయింది. దీంతో అనిల్, వౌనిక పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు జరిగే ఎల్‌ఎండికాలనీలోని తాపాళ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకుందానుకుని ఆ ప్రేమ జంట స్నేహితులు, అనిల్ తండ్రితో కలిసి గురువారం దేవాలయానికి చేరుకున్నారు. ముందుగా ఆలయంలో పూజారికి వారివారి సర్ట్ఫికెట్లను వెరిఫికేషన్‌కు ఇచ్చారు. ఇక కొన్ని నిమిషాల్లో దండలు మార్చుకుని ఒకటయ్యే సమయంలో యువతి సోదరుడు వంశీకృష్ణ తన స్నేహితులతో కలిసి ఆలయానికి చేరుకుని పెళ్లి దుస్తుల్లో ఉన్న అనిల్‌పై దాడి చేశాడు. కత్తితో గొంతులో, కడుపులో అతి దారుణంగా పొడిచి చంపారు. అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన అనిల్ తండ్రి ఎల్లయ్యను తీవ్రంగా గాయపరిచారు. వౌనికను తీసుకుని వెళ్లిపోయారు. సినిమా సన్నివేశంలా ఇదంతా పది నిమిషాల్లోనే జరిగిపోయింది. సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసు కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి, ఎసిపి రామారావు, ఎల్‌ఎండి సిఐ వెంకటరమణ, స్థానిక ఎస్‌ఐలు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

చిత్రం..నెత్తుటి మడుగులో అనిల్