రాష్ట్రీయం

ఐదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదర్శనగర్‌లో రాష్టస్థ్రాయి బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన దత్తాత్రేయ అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని, రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నదని, నూతన వ్యవసాయ విప్లవాన్ని తీసుకువచ్చి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా రైతాంగాన్ని సన్నద్ధం చేయడానికి వివిధ కార్యక్రమాలను అమలుచేస్తోందని దత్తాత్రేయ తెలిపారు. రైతు రుణాల పంపిణీ, వ్యవసాయ పనిముట్లు, సాధనాల రుణాలు, ముద్రా బ్యాంకు యోజన అంశాలపై బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు.
రైతు రుణాల పంపిణీలో 2016 సెప్టెంబర్ నాటికి 13వేల కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేసి బ్యాంకులు రైతులకు లబ్ది చేకూర్చాయన్నారు. రాబోయే రబీ కాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా రైతులకు పంట రుణాలను పంపిణీ చేయాలని బ్యాంకు అధికారులను కోరినట్టు మంత్రి వివరించారు. రైతులకు బహు ప్రయోజనకారిగా ఉన్న ఫసల్ బీమా యోజన కోసం తెలంగాణ రాష్ట్రం నుండి అర్హులైన రైతులు 25 లక్షలు ఉండగా, అందులో కేవలం 8 లక్షల మంది రైతులు మాత్రమే పంట బీమా పథకానికి నమోదు చేసుకున్నారని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. జాతీయ విపత్తునిధి కింద గత ప్రభుత్వం 2010-15 కాలానికి 163 కోట్ల రూపాయిలను కేటాయించిన ఎన్‌డిఎ ప్రభుత్వం 2015-20 కాలానికి 1515 కోట్ల రూపాయిలను కేటాయించిందని మంత్రి తెలిపారు. ముద్ర యోజన పథకం గురించి వివరిస్తూ 50వేల రూపాయిల లోపు రుణాలు ఇచ్చే శిశు కేటగిరిలో 154 కోట్ల రూపాయలను 58వేల మందికి అందించారు. కిశోర్ విభాగంలో 767 కోట్ల రూపాయలను 41వేల మందికి, తరుణ్ విభాగంలో 390 కోట్ల రూపాయిలను 5400 మందికి ముద్ర యోజన ద్వారా పంపిణీ చేశారు. నిర్దేశించిన లక్ష్యం మొత్తం 4475 కోట్లు కాగా, ఇంత వరకూ 1315 కోట్ల రూపాయిలను తెలంగాణ రాష్ట్రంలో అందించారని చెప్పారు.