తెలంగాణ

టి.ఉద్యమంలో ఎబివిపి పాత్ర నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎబివిపి పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. 33వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం గౌరీశంకర్ స్మారక అవార్డు ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందువుగా, భారతీయుడిగా ఎందుకు గర్వించాలి, చిర స్మరణీయులైన ఆదిశంకరాచార్య, భగత్‌సింగ్, వివేకానందుడు, శివాజి, అల్లూరి తదితరులు పురిగొల్పిన ఆదర్శాలు ఏమిటని ఆలోచిస్తే ప్రతి విద్యార్థీ మహనీయుడిగా ఎదిగే అవకాశం ఉందని ఉద్బోధించారు.
ప్రస్తుత సమాజంలో మేధావులుగా చెలామణి అవుతున్న సూడో సెక్యులరిస్టులు ఆరు దశాబ్దాల అనంతరం కేంద్రంలో ఏర్పడిన సుస్ధిర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని శాస్ర్తీ ఆవేదన వ్యక్తం చేశారు. గోవధ నిషేధం రాజ్యాంగంలోనే ఉన్నా రాజకీయం కోసం రాద్ధాంతం చేస్తున్నారని, యువత అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు.
దేశ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పిన వ్యక్తి పాలన కొనసాగించరాదని కుయుక్తులు పన్నుతున్న వారిపట్ల జాతి ఆలోచించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఈ దఫా అవకాశం వెళ్లిపోతే మరో యాభై, వంద సంవత్సరాలైనా దేశం అభివృద్ధి సాధించకపోగా దోపిడీ శ్రుతిమించుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కారం, సభ్యత, హుందాతనం అంటే ఏమిటో ఎబివిపి కార్యకర్తల కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల ద్వారా స్పష్టమైందని అభినందించారు. రోడ్డు, విమానం, రైలు మార్గాలు లేని నాటి రోజుల్లోనే జగద్గురు ఆదిశంకరాచార్యులు 30 ఏళ్ల వయసులోనే దేశమంతా పర్యటించి ధర్మసంస్థాపన చేశారన్నారు. క్రాంతికార్ భగత్‌సింగ్ 24వ ఏటనే ఉరికంబమెక్కి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. స్వామి వివేకానంద 40 ఏళ్ల ప్రాయంలో హిందూ ధర్మసంస్థాపన ఔచిత్యాన్ని వేదప్రామాణికంగా వివరించి విశ్వమానవాళి ఆదరాభిమానాలను చూరగొన్నారని గుర్తు చేశారు. విద్యార్థి పరిషత్ విస్తరణకు అవిశ్రాంతంగా కృషి చేసిన గౌరీ శంకర్‌జీ గూర్చి తెలుసుకునే అవకాశం ఈ వేదిక ద్వారా లభించిందన్నారు. ప్రస్తుతం చిన్నపనికే హంగు ఆర్భాటాలతో ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో ఆపన్నులు, నిస్సహాయులకు ‘అమ్మ-నాన్న ఫౌండేషన్’ ద్వారా సేవలందిస్తున్న నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌కు చెందిన గట్టు శంకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అంతకు ముందు గౌరీజీ పేరిట ఎబివిపి స్మారక అవార్డును గట్టు శంకర్ దంపతులకు అందజేసి, సంప్రదాయ పద్ధతిలో సన్మానించి రూ.25వేల నగదు పురస్కారం, జ్ఞాపికను అందజేశారు.
నెహ్రూ యువ కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ గౌరీ శంకర్‌జీతో ఉన్న అనుబంధం, ఎబివిపి విస్తరణకు ఆయన చేసిన కృషి, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు, సామాజిక ప్రతిఘటన శక్తిగా వారు చేసిన నిరంతర ప్రయత్నాలను వివరించారు. కార్యక్రమంలో ఎబివిపి రాష్ట్ర అధ్యక్షుడు చెన్న కృష్ణారెడ్డి, కార్యదర్శి అయ్యప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్, మాధవరెడ్డి, ప్రొఫెసర్లు రావుల కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... గట్టు శంకర్ దంపతులకు గౌరీజీ స్మారక అవార్డును అందజేస్తున్న ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ, పాల్గొన్న విద్యార్థులు