రాష్ట్రీయం

డిఎస్పీల పదోన్నతుల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: పోలీసు డిఎస్పీలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నేరుగా నియమితులైన అధికారులు, పదోన్నతులు పొందిన అధికారుల సీనియారిటీ జాబితాను పోలీసు శాఖ రూపొందించని విషయమై దాఖలైన పిటిషన్ విచారణను హైకోర్టు ధర్మాసనం స్వీకరించింది. రెండు రాష్ట్రాల డిజిపిలు పోలీసు డిఎస్పీల సీనియారిటీ జాబితాను రూపొందించాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ చిలుకూరి చెన్నయ్య అనే అధికారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. పిటిషనర్ల తరఫున పివి కృష్ణయ్య అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీనియారిటీ జాబితాను రూపొందించకుండా డిజిపిలు డిఎస్పీలకు పదోన్నతులు ఇస్తున్నారని కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసును ధర్మాసనానికి నివేదించాలని హైకోర్టు జడ్జి రిజిస్ట్రీని ఆదేశించారు.