రాష్ట్రీయం

అంగట్లో నకిలీ సర్ట్ఫికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: ఇంజనీరింగ్ సర్ట్ఫికెట్ రేటు రూ. 80వేలు, ఎంబిఏ సర్ట్ఫికెట్ రేటు రూ. 40 వేలు, ఎంసిఏ సర్ట్ఫికెట్ రేటు రూ. 50 వేలు, డిగ్రీ సర్ట్ఫికెట్ రేటు రూ. 40 వేలు, ఇంటర్ సర్ట్ఫికెట్ రేటు రూ. 15 వేలు. ఏ కాలేజీలో చదవకుండానే ఈ సొమ్ము చెల్లిస్తే మీకు వెంటనే సర్ట్ఫికెట్ దొరుకుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా 11 వర్శిటీల నకిలీ సర్ట్ఫికెట్లను ముద్రించి విక్రయిస్తున్న నగరానికి చెందిన మహమ్మద్ జుమేర్ అలియాస్ జుబేర్ అలియాస్ హుస్సేన్ అనే ఘరానా మోసగాడిని టాస్క్ఫోర్స్ అరెస్టు చేసింది. నిందితుడు జుమేర్‌నుంచి 60 నకిలీ సర్ట్ఫికెట్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక కలర్ ప్రింటర్, 25 దరఖాస్తు ఫారాలు, నాలుగు స్టాంపులు, నంబర్లు వేసే యంత్రాలు 2, ఫీజు స్వీకరించే రశీదుపుస్తకం, 50 విజిటింగ్ కార్డులు, రెండు సెల్‌ఫోన్లు, వెయ్యి రూపాయల నగదును డిసిపి బి లింబారెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2011లో జుమేర్ మలక్‌పేటలో క్విక్ జాబ్ సొల్యూషన్స్ పేరిట కన్సల్టెన్సీని మలక్‌పేటలో ప్రారంభించి చాలా మంది యువకులకు ఐటి కంపెనీల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బు వసూలు చేసి మాయమయ్యాడు. 2015లో చంపాపేట రోడ్డులో హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పేరిట మరో సంస్థను తెరిచాడు. ఆ తర్వాత పంజాగుట్ట మోడల్ హౌస్‌కు మారాడు. అక్కడ హరిబాబు అనే వ్యక్తితో కలిసి వివిధ విశ్వవిద్యాలయాల నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసేవాడు. బషీర్‌బాగ్‌లో బాబూఖాన్ ఎస్టేట్‌లో కూడా ఒక ఆఫీసు తెరిచాడు. పత్రికల్లో దూర విద్య కోర్సులపై ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేవాడు. సర్ట్ఫికెట్లకోసం వచ్చే వారికి పరీక్షలు రాయించకుండానే నకిలీ సర్ట్ఫికెట్లు ఇచ్చేవాడు. దీని కోసం పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. గతంలో నిందితుడు జుమేర్‌పై చాదర్‌ఘాట్, సైఫాబాద్, పంజాగుట్ట పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి.