రాష్ట్రీయం

కుంగిన రైల్వే ట్రాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, అక్టోబర్ 22: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని కుందూనది వంతెన వద్ద శనివారం మధ్యాహ్నం రైల్వేట్రాక్ కుంగిపోయింది. ఐదు నిమిషాలకు ముందు ఇదే ట్రాక్‌పై గరీబ్థ్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లింది. రైలు ఏమాత్రం ఆలస్యమైనా ఘోర ప్రమాదం జరిగి ఉండేది. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు, సిబ్బంది యుద్దప్రాతిపదికన ట్రాక్‌ను పునరుద్దరించారు. పూరీ నుంచి బెంగళూరుకు వారానికి ఒకసారి తిరిగే గరీబ్థ్ ఎక్స్‌ప్రెస్ నంద్యాల పట్టణంలోని కుందూనది వంతెనపై నుంచి డోన్ వైపువెళ్లిన కొద్ది నిమిషాలకే ట్రాక్ కుంగిపోయింది. యర్రగుంట్ల రైల్వేలైన్‌ను కలిసే చోట క్యాబిన్‌కు సమీపంలో కుందూనదిపై రెండో వంతెన కోసం నిర్మాణం పనులు జరుగుతున్నాయి. పిల్లర్ల కోసం ట్రాక్ పక్కనే లోతుగా గుంతలు తీయడంతో ట్రాక్ కుంగిపోయినట్లు అధికారులు తెలిపారు. ట్రాక్ కూలడంతో డోన్ వైపు వెళ్లాల్సిన రైళ్లు, గూడ్స్‌రైళ్లను నంద్యాల రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. అలాగే నంద్యాల వైపు వచ్చే రైళ్లను పాణ్యం, బేతంచర్ల స్టేషన్లలో ఆపారు. మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి సాయంత్రం 6 గంటలకు ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు. దీంతో విజయవాడ నుండి హుబ్లీ వెళ్లే ప్యాసింజర్ రైలు, కాచిగూడ నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్ రైలు రెండు, మూడు గంటలు ఆలస్యంగా తిరిగాయి.

చిత్రం.. నంద్యాల సమీపంలో కుంగిన రైల్వేట్రాక్‌కు మరమ్మతులు చేస్తున్న సిబ్బంది