విద్యుత్ చార్జీలపై సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్ విధానాన్ని సరళీకృతం చేయడం, విద్యుత్ టారిఫ్‌లో ఉన్న అనేక శ్లాబ్‌లను తొలగించాలనే విషయమై తిరుపతిలో ఈ నెల 26వ తేదీన విద్యుత్ నిపుణులు, సలహాసంఘం సభ్యులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో 1.5 కోట్ల మంది విద్యుత్ వినియోగదారుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర సలహా సంఘం, రాష్ట్ర కో ఆర్డినేషన్ ఫోరం సమావేశంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను చర్చిస్తామన్నారు. విద్యుత్ లోడ్ అంచనా, నుంచి విద్యుత్ సేకరణ, పంపిణీ, కెపాసిటీని పెంచడం, మిగులు విద్యుత్‌ను పర్యవేక్షించడం, డిస్కంల ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసే అంశాలపై చర్చిస్తారు. ఇంకా విద్యుత్ పరిశ్రమ, చట్టపరమైన నిబంధనలు, సంస్కరణలు, రోడ్‌మ్యాప్‌పై చర్చిస్తారు. ఈ సమావేశానికి సిఐఐ, ఎఫ్‌టాప్సీ, ఎన్‌జివో, రైల్వేశాఖ, ఇంధన సంరక్షణ సంఘం సభ్యులను ఆహ్వానిస్తామన్నారు.