అంతర్జాతీయం

బ్రిటన్ రాణికి ‘బ్రెగ్జిట్’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 23: యురోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎలిజబెత్ రాణికి చెందిన రాజరికపు ఎస్టేట్ తీవ్ర నష్టాలను చవిచూస్తుందని బ్రిటన్ మీడియా రిపోర్ట్ చేసింది. నార్‌ఫోక్‌లోని బ్రిటన్ రాజవంశానికి చెందిన సండ్రింగమ్ ఎస్టేట్‌కు ఈయూ వ్యవసాయ సబ్సిడీలు నిలిచిపోతే సంవత్సరానికి సుమారు 7లక్షల పౌండ్ల వరకు నష్టం వాటిల్లుతుందని సండే టెలిగ్రాఫ్ పేర్కొంది. అటు విండ్సర్‌లోని వ్యవసాయ క్షేత్రానికీ సుమారు 3లక్షల పౌండ్ల వరకు నష్టం వాటిల్ల వచ్చని అంచనా వేసింది. ఇక ప్రిన్స్ చార్లెస్‌కు చెందిన ఎస్టేట్‌కు లక్ష పౌండ్ల నిధుల కోత ఉంటుందని సండే పేర్కొంది. బ్రెగ్జిట్ కారణంగా బ్రిటన్ దేశ వ్యాప్తంగా ఉన్న రాజరికపు వ్యవసాయ క్షేత్రాలు, సంయుక్త వ్యవసాయ విధానం ద్వారా లబ్ధి పొందుతున్న వేలమంది రైతులు సుమారుగా పది లక్షల పౌండ్ల వరకు నష్టపోవచ్చు.
యురోపియన్ యూనియన్‌లో భాగస్వామిగా ఉన్నందువల్ల నిరుడు రాజరికపు వ్యవసాయ క్షేత్రాలు సుమారు మిలియన్ పౌండ్లు లబ్ధి పొందాయి. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగిన తరువాత ఈ మేరకు రాచరికపు వ్యవసాయ క్షేత్రాలు నష్టపోక తప్పదు.