రాష్ట్రీయం

ఇంటర్ ఫ్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: ఇంటర్మీడియట్ (ప్లస్ టు) విద్యను విద్యా హక్కు చట్టం పరిధిలోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. ఇంటర్‌తోపాటు పూర్వ విద్య (ప్రీ స్కూల్)నూ చట్టపరిధిలోకి తెచ్చే అంశంపై మంగళవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈమేరకు కేంద్ర విద్యా సలహా మండలి (కేబ్) కీలక సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది.
విద్యా హక్కు చట్టం పరిధిలోకి ఇంటర్మీడియట్, పూర్వ విద్యను తీసుకొస్తే వారికీ మధ్యాహ్న భోజన పథకం అమలుతోపాటు ఉచిత విద్య అందించాల్సి ఉంటుంది. దీంతోపాటు కేబ్ సమావేశంలో అనేక ఇతర అంశాలపైనా చర్చ జరగనుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న నిరంతర సమగ్ర విద్యా మూల్యాంకనంతో పాటు మరింత సత్ఫలితాలు సాధించేందుకు వీలుగా అభ్యాసన పద్ధతులు మెరుగుపరిచే అంశంపైనా చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టీచర్ల నియామకాలు, నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే, టెన్త్ బోర్డు పరీక్షల నిర్వహణ, సంతోషంగా నేర్చుకునే పద్ధతులను అమలుచేయడం, ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీలను చేర్చడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వివిధ సబ్ కమిటీలు తమ నివేదికలను అందిస్తాయి. ఆ నివేదికలపైనా సమగ్ర చర్చ జరుగుతుంది. చర్చకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి విద్యామంత్రులు, విద్యాశాఖ కార్యదర్శులు, వివిధ బోర్డుల సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు హాజరవుతారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, పరిస్థితులను మెరుగుపర్చడం, విద్యాహక్కు చట్టం అమలు చేస్తే ఎట్టి పరిస్థితిలో ఏ క్లాసులోనూ డిటెన్షన్ అమలు చేయరాదనే నిబంధన వివిధ రాష్ట్రాల్లో ఎలా ఉందనే దానిపైనా చర్చించనున్నారు. బడి బయట ఉన్న పిల్లలను తిరిగి బడిలో చేర్పించడం, పాఠశాలల్లో, ఉన్నత విద్యా కోర్సుల్లో సాంకేతిక నైపుణ్యంతో పాటు వృత్తి విద్యా నైపుణ్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలను చర్చిస్తారు. ప్రొఫెసర్ రాంశంకర్ కెథిరియా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విద్యా హక్కు చట్టం విస్తరణ కమిటీ తమ నివేదికను ఇవ్వనుంది. ఇందులో 28మంది సభ్యులున్నారు. మరో కమిటీకి గుజరాత్ విద్యా మంత్రి భూపేంద్ర సిన్హా మనుభాచూడాసమా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సబ్ కమిటీల నివేదికలపై చర్చ ముగిశాక, తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ రంజన్ చెప్పారు.