తెలంగాణ

గణేశ్ అంటే హడలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, అక్టోబర్ 24: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు సమీపాన బెజ్జంగి అడవులలో సోమవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మావోయిస్టు అగ్ర నేత గణేష్ (బాకూరు వెంకటరమణ) మృతి చెందాడు. రెండు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో ఉంటూ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన గణేష్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం విశేషం. పోలీసులు పన్నిన వ్యూహంలో ఈ మావోనేత అనేక సార్లు చిక్కినట్టే చిక్కి త్రుటిలో తప్పించుకున్నాడు. చివరకు సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతం కావలసి వచ్చింది. తమకు లొంగిపోతే పునరావాసం కల్పించడంతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తామని కూడా పోలీసులు పలుసార్లు గణేష్‌కు వర్తమానాలు పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే మావోయిస్టు ఉద్యమానికే అంకితమైన గణేష్ పోలీసులు వ్యూహాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడమే కాకుండా అనేకసార్లు జరిగిన ఎన్‌కౌంటర్లలో కూడా తప్పించుకోగలిగారు. విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం బాకూరు గ్రామానికి చెందిన గణేష్ విద్యార్థి దశలో అప్పటిలో ఉన్న గిరిజన హక్కుల పరిరక్షణ సంఘం (ఒ.పి.జి.ఆర్.)లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అప్పటిలో పీపుల్స్‌వార్ పార్టీగా ఉన్న ప్రస్తుత మావోయిస్టు పార్టీకి ఒ.పి.జి.ఆర్. అనుబంధ సంస్థగా ఉంటూ నిషేదానికి గురయ్యింది. దీంతో 1994లో గణేష్ పీపుల్స్‌వార్ పార్టీలో చేరి అనతికాలంలోనే క్రియాశీలకంగా మారాడు. మావోయిస్టు పార్టీ ఆయనను ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా, ఎఒబి స్పెషల్ జోనల్ కమిటి సభ్యునిగా కూడా నియమించింది. 2007 సెప్టెంబర్ 20న పెదబయలు మండలం అమ్మిడేలు గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇదే ప్రదేశంలో ఉన్న గణేష్ పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. గుంటగనె్నల గ్రామ సమీపాన ఇటీవల గణేష్‌ను అంతమెందించేందుకే పోలీసులు ఈ ప్రాంతంపై దాడి చేసినప్పటికీ గణేష్ తప్పించుకుని పోలీసులకు చమటలు పట్టించారు. 2010వ సంవత్సరంలో పాండవుల గుట్టఎన్‌కౌంటర్ నుంచి కూడా తప్పించుకున్నాడు.