తెలంగాణ

పెండింగ్ ఉండొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: వ్యవసాయ విద్యుత్ కోసం దరఖాస్తు చేసిన రైతులందరికీ కనక్షన్లు ఇవ్వాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దాదాపు ఐదేళ్లుగా పెండింగ్‌లోవున్న దరఖాస్తులతోపాటు, మరో 30 వేల దరఖాస్తులకూ ఏడు నెలల్లో కనెక్షన్లు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, కనెక్షన్లు ఇచ్చే క్రమంలో అనేక అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పిడిసిఎల్, ఎన్‌పిడిసిఎల్ సిఎండీలు డి ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి, గోపాల్‌రావు తదితర ఉన్నతాధికారులతో సిఎం సమావేశమయ్యారు. పెండింగ్ కనెక్షన్లు క్లియర్ చేయడానికి రూ.600 కోట్లతో పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించగా, సిఎం ఆమోదం తెలిపారు. రైతులకు ఉపయోగపడే కార్యక్రమం కావడంతో ఖర్చుకు ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 97 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటన్నింటికీ కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ ఎట్టిపరిస్థితుల్లో ఏడు నెలల్లో పూర్తి కావాలన్నారు. రాబోయే నెలల్లో 30 వేల కనెక్షన్లకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండటంతో, వీటినీ పరిగణనలోకి తీసుకొని అన్నింటినీ పూర్తి చేయాలన్నారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్ల ఎవరు డబ్బులిస్తే వారికే కనెక్షన్లు ఇచ్చే దందా నడుస్తుందని సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి లంచం ఆశించకుండా, కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయకుండా, ప్రజాప్రతినిధుల సిఫారసు లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఇస్తే అక్రమాలకు తెరపడుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు కనెక్షన్లు ఇవ్వడానికి పెద్ద మొత్తంలో పరికరాలు కొనుగోలు చేయడానికి, లైన్లు వేయడానికి సమయం పడుతుందన్న ఉద్దేశంతోనే ఏడు నెలల వ్యవధి ఇచ్చినట్టు సిఎం కెసిఆర్ ప్రస్తావించారు. ఎవరికి ఎప్పుడు కనెక్షన్ వస్తుందో తెలియని గందరగోళ పరిస్థితి పోవాలని, ఏ మండలంలో ఎప్పుడు కనెక్షన్ ఇచ్చే దానిపై కార్యాచరణ తయారు చేయాలని సిఎం ఆదేశించారు. ఈ షెడ్యూల్‌ను ప్రతి గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులపై పెట్టడంతోపాటు, రైతులకు వ్యక్తిగతంగా తెలియజేస్తూ లేఖలు రాయాలని సూచించారు. కార్యక్రమాన్ని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రబీలో 9గంటల విద్యుత్
రబీ సీజన్‌లో వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశామని సిఎం వివరించారు. రాష్ట్రంలో పది వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండటంతో రూ.2,450 కోట్ల వ్యయంతో కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయితే గొట్టపు బావుల ఉపయోగం తగ్గి ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ వినియోగం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో 5,46,000 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయని, వీటి కోసం 4 శాతం మేర ట్రాన్స్‌ఫార్మర్ల రోలింగ్ స్టాక్ పెడుతున్నామన్నారు. ఎక్కడ విద్యుత్ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం... విద్యుత్ ప్రగతిపై నిర్వహించిన ఉన్నతస్థాయ సమీక్షకు హాజరై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న టిపిడిసిఎల్ సిఎండి గోపాల రావు