రాష్ట్రీయం

కలిసుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: రాష్ట్ర విభజన జరిగి రెండున్నర సంవత్సరాలు కావస్తుండటంతో ఇక ఘర్షణలకు స్వస్తి చెప్పి సామరస్యంతో మెలగాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. కారణాలు ఏవైనా ఘర్షణ పడితే వ్యక్తిగతంగానూ, పరిపాలనాపరంగానూ ఇబ్బందులు ఏర్పడతాయన్న ఆలోచనకు ఇద్దరూ వచ్చినట్టు తెలిసింది. అంతేకాకుండా సాధారణ ఎన్నికలకుకూడా సమయం పెద్దగా లేకపోవటం వల్ల తమ తమ పార్టీలను విజయంవైపు నడపించేందుకు ఇద్దరు సిఎంలు ఇప్పటినుండే పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కెసిఆర్,చంద్రబాబు రాజకీయంగా విమర్శలు చేసుకోవటం తగ్గించుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే ఇద్దరు ముఖ్యమంత్రులు, లేదా రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు కూర్చుని చర్చించి, పరిష్కరించుకుంటారని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఇటీవల ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం.
గవర్నర్ నరసింహన్‌తో కలుస్తున్న పలు సందర్భాలలో కెసిఆర్,చంద్రబాబు ఒకరి గురించి మరొకరు ప్రస్తావించుకుంటున్నారని, ఘర్షణ వాతావరణం నుండి బయటపడి, స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఏవైనా జటిల సమస్యలు వస్తే ఇద్దరు సిఎంలను కూచోబెట్టి పరిష్కరించేందుకే గవర్నర్ మొగ్గు చూపుతున్నారని తెలిసింది.
ఎపి రాష్ట్ర సచివాలయం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్ (హెచ్‌ఓడిలు)విజయవాడ తరలివెళ్లడంతో ఇప్పుడు పరిపాలనాపరంగా ఎపి ప్రభుత్వానికి హైదరాబాద్‌తో పెద్దగా సంబంధాలు లేవు. సచివాలయంలో కొన్ని శాఖల్లో మాత్రం ‘స్కెలిటన్ స్ట్ఫా’ ఉన్నారు. వీరిని కూడా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతో హైదరాబాద్‌తో ఎపి ప్రభుత్వానికి దాదాపు సంబంధాలు తెగిపోయినట్టే. పదేళ్లపాటు హైదరాబాద్ నుండే పరిపాలన కొనసాగించేందుకు రాష్ట్ర విభజన చట్టంలో అవకాశం కల్పించినప్పటికీ, ఎపి కొత్తరాజధానికి తరలివెళ్లడమే ఉత్తమమనని భావించిన చంద్రబాబు వేగంగా భవనాల నిర్మాణం చేయించి, ప్రధాన కార్యాలయాలన్నింటినీ తరలించారు.
కెసిఆర్‌ను అనవసరంగా విమర్శించవద్దని ఎపితో పాటు తెలంగాణకు చెందిన టిడిపి శ్రేణులకు కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. దాంతో తెలంగాణ ప్రభుత్వంపై కానీ, కెసిఆర్‌ను కాని ఎవరూ పెద్దగా విమర్శించడం లేదు. అలాగే చంద్రబాబును కూడా అనవసరంగా విమర్శించకూడదని కెసిఆర్ భావిస్తున్నారు. రాజకీయంగా మాట్లాడాల్సి వస్తే తప్ప అనవసరంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, మంత్రులకు, టిఆర్‌ఎస్ శ్రేణులకు సూచనలు చేశారని తెలిసింది. ఇప్పుడు ఇద్దరు సిఎంలుకూడా తమ తమ రాష్ట్రాల్లోని ప్రజాసమస్యలపై, పరిపాలనపై దృష్టి కేంద్రీకరించారు. అమరావతి నిర్మాణాన్ని 2019 ఎన్నికల నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తుండగా, హైదరాబాద్‌లో రాష్ట్ర సచివాలయానికి కొత్త్భవనాలు, కొత్త జిల్లాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణంపై కెసిఆర్ దృష్టి కేంద్రీకరించారు. ఇద్దరు సిఎంలు కూడా సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం తదితర వౌలిక రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
గవర్నర్ ఉమ్మడిగా ఉండటం వల్ల ఎపి పరిపాలనకు సంబంధించి కొన్నిఫైళ్లు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు తరలించాల్సి వస్తోంది. గవర్నర్ నరసింహన్ ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. గవర్నర్‌కు కూడా ప్రత్యేక బంగళా ఏర్పాటు చేసి నెలలో కొన్ని రోజుల పాటు విజయవాడలో ఉండేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో స్టేట్ గెస్ట్‌హౌస్ ఉంది. చంద్రబాబు ఉపయోగిస్తున్న క్యాంప్ ఆఫీస్‌కు ఇది దగ్గర్లోనే ఉంటుంది. ఈ గెస్ట్‌హౌస్‌నే తాత్కాలికంగా గవర్నర్ బంగళా (రాజ్‌భవన్)గా ఉపయోగించాలని భావిస్తున్నారు. శాశ్వతంగా మరొక భవన నిర్మాణానికి ప్రణాళికను ఇప్పటికే రూపొందించారు. దీనివల్ల పరిపాలనాపరమైన సౌలభ్యం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే గవర్నర్ నరసింహన్‌తో చంద్రబాబు చర్చించారు కూడా. త్వరలోనే ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

చిత్రం.. తెలంగాణ సిఎం కెసిఆర్‌తో చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫొటో)