ఆంధ్రప్రదేశ్‌

మారనున్న రూపురేఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 26: వౌలిక వసతుల కల్పనతో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపురేఖలే మారబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వచ్చే నాలుగేళ్లలో 32 వేల 500 కోట్ల రూపాయలతో వౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 950 ఎకరాలలో శాశ్వత సచివాలయం, సిఎం క్యాంప్ కార్యాలయం, శాసనసభ భవనాల నిర్మాణాలకు శుక్రవారం కేంద్రమంత్రి జైట్లీ శంకుస్థాపన చేయబోతున్నారు. నిధులను వేగవంతంగా సమీకరించడంతో పాటు ముఖ్యంగా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు ప్రారంభించింది. రాజధాని అమరావతి భారతదేశానికే తలమానికంగా నిలిచేలా వౌలిక వసతులను కల్పించేందుకుగాను వచ్చే పదేళ్లలో కనీసం 43 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తనవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందించగలదంటూ కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు సైతం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. అమరావతిలో అన్ని వసతులు ఉంటే పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో రహదారుల అనుసంధానం 24 గంటలు నాణ్యమైన విద్యుత్, మంచినీటి సరఫరా, మెరుగైన మురుగునీటి పారుదల వ్యవస్థ వ్యర్థాల నిర్వహణపై ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు. వౌలిక వతుల కల్పనకు వచ్చే నాలుగేళ్లలో ఖర్చు చేయదలచిన 32 వేల 500 కోట్ల రూపాయలతోను 9 మార్గాలను సమీకరించదలచారు. ఇందులో 30 శాతం వరకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇక దేశంలోని టాప్ 10 విద్యా సంస్థలను, అంతర్జాతీయ విద్యా సంస్థలను అమరావతిలో నెలకొల్పేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు పరిశ్రమలు స్టార్ హోటళ్ల ఏర్పాటుతో అమరావతి సత్వరంగా అభివృద్ధి చెందగలదని సిఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం కోర్ కాపిటల్‌లో భూములను రాజధానికి తలమానికంగా నిలిచే సంస్థలకే కేటాయించదలిచారు. 15ఏళ్లలోనే అమరావతిని మెగా సిటీగా మలచాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్ని రంగాల్లో వృద్ధి చెందేలా చూడాలంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగరం రూపురేఖలే మారుతున్నాయి. దీంతోపాటే అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి చెందే నిర్ణయాలు కూడా ఒకదాని వెంట మరొకటిగా వెలువడుతున్నాయి. పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం దేశంలోనే ప్రప్రథమంగా భారతీయ ట్రస్టుల చట్టం 1882 ప్రకారం ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్ పేరిట ఒక చట్టబద్ధత గల ట్రస్ట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. సెబీ నిబంధనల కనుగుణంగా దాన్ని రిజిస్టర్ చేస్తారు.

స్విస్ ఛాలెంజ్‌పై వెనక్కి తగ్గం
సవరణలతో తిరిగి టెండర్లు * మంత్రి నారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, అక్టోబర్ 26: రాజధాని అభివృద్ధికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ విధానంపై ప్రభుత్వం వెనక్కితగ్గేదిలేదని పురపాలకశాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి సిఎం క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో సింగపూర్ కన్సార్టియంలు చేసిన ఆమోదయోగ్యంకాని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుగానే వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించామని, అయితే ఇందులో పోటీకి వచ్చిన బిడ్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఇంతలో హైకోర్టులో వాదోపవాదాలు లేవనెత్తినందున చట్టపరంగా ఆమోదయోగ్యమైన సవరణలు తీసుకొచ్చి మరోసారి రీ ప్రజెంట్ చేస్తామని వివరించారు. ఇదిలా ఉండగా రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణంపై సీఆర్డీయేతో ముఖ్యమంత్రి జరిపిన సమీక్షా సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. 2018 నాటికి పాలనాపరంగా ప్రభుత్వ భవనాలు, ఐకనిక్ టవర్లు, ఐకానిక్ వంతెనలు పూర్తయ్యేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేయాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను కోరారని ఈ మేరకు డిజైన్లు, టెండర్ల ప్రక్రియలపై ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. ఏడాదిలోపు భవనాల నిర్మాణానికి సంబంధించి ప్రతి నెలా షెడ్యూల్ రూపొందించాలని సిఎం ఆదేశించారని చెప్పారు. కాగా గృహ నిర్మాణంపై జరిగిన సమీక్షలో 2022 కల్లా ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ముఖ్యమంత్రి ఆకాంక్షగా వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాసిరకమైన ఇళ్లను నిర్మించిందని, కాలం చెల్లిన వాటి మరమత్తులకు తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు.