రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసేందుకు హైకోర్టు ఏపి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.
తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఈ కేసును సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపి ప్రభుత్వం తరఫున న్యాయవాది కృష్ణ ప్రకాశ్ వాదనలు వినిపిస్తూ ప్రజలను మోసం చేసే సంస్ధలు, చిట్‌ఫండ్స్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేసుకునే విధంగా ఏపి ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. ఈ-వేలం ద్వారా విక్రయించిన ఆస్తులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఈ కేసును హైకోర్టు నిరంతరం పర్యవేక్షిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని హైకోర్టు తెరిచిన ఖాతాలో జమ చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎస్‌వి భట్ ఆదేశించారు. అనంతరం కేసు విచారణ నవంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు.