రాష్ట్రీయం

నువ్వు నాకు నచ్చావ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం, డిసెంబర్ 27: ‘నువ్వు నాకు నచ్చావ్’ అంటూ ఓ చైనా యువతి తెలుగబ్బాయిపై మనసు పారేసుకుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమానికి జింగ్ జుంగ్ జాంగ్ (28) చైనాను నుంచి వచ్చింది. వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం గ్రామవాసి, కల్కి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న భాస్కర్ యాదవ్ కుమారుడు మునిరాజ (22) సూళ్లురుపేట గోకులకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తిచేశాడు. గత ఏడాదిగా వీరి మధ్య స్నేహం వికసించింది. ఈ క్రమంలో తనతో చైనాకు వచ్చేయాలని ఆ యువతి మూడు రోజుల క్రితం మునిరాజ ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు తన మనసులోని మాట చెప్పింది. దీంతో మునిరాజ కుటుంబ సభ్యులుఅవాక్కయ్యారు. మునిరాజ పరారయ్యాడు. ఈ సంగతి పోలీసుల దృష్టికి వెళ్లింది. అయతే చైనా అమ్మాయికి సంబంధించిన అంశంలో తమ ఆశ్రమానికి ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం ఆమె తమ ఆశ్రమంలో లేదని కల్కి ఆశ్రమ ఇన్‌చార్జి లోకేష్ విలేఖరులకు తెలిపారు. ఇలావుండగా చైనా యువతి మునిరాజు కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు సహాయం చేసిందని గ్రామంలో ప్రచారం జరుగుతోంది. పోలీసులు, చైనా ఎంబసీ అధికారులు, భారతదేశంలో ఉన్న చైనా యువతి గైడ్ డానీ జోక్యం చేసుకుని ఆ యువతిని స్వదేశం పంపేందుకు ఆమెను అంగీకరింపజేశారు. అయితే చైనా యువతితో సంబంధం పెట్టుకొన్న మునిరాజాను సోమవారంనాడు వరదయ్యపాళెం పోలీసులు విచారించనున్నారు. అయితే చైనా యువతి వ్యవహారంలో మునిరాజా జీవితం ఎటు తిరుగుతుందో పోలీసుల విచారణలో మాత్రమే తేలనుంది. గతంలో కల్కీ ఆశ్రమానికి వచ్చిన విదేశీ యువతులు ఇలాంటి ప్రేమాయాణాలు నడిపినప్పటికీ కల్కీ నిర్వాహకులు అప్రమత్తం కావడంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని తెలుస్తోంది.