రాష్ట్రీయం

ఏసిబి కోర్టు ఆదేశాలు చెల్లవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: ఓటుకు నోటు కేసులో తాజాగా దర్యాప్తు చేపట్టాలంటూ ఏసిబి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపిస్తూ ఒక కేసులో రెండో ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసేందుకు చట్టం అంగీకరించదని తెలిసినా, ఏసిబి కోర్టు సెక్షన్ 156(3) సిఆర్‌పిసి కింద తాజా దర్యాప్తుకు ఆదేశించిందన్నారు. టిటి ఆంటోని వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ, ఈ కేసులో ఒక నిందితుడిపై విచారణ పెండింగ్‌లో ఉండగా, ఇదే కేసులో చార్జిషీటు దాఖలైన విషయం తెలిసినా, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏసిబి కోర్టు సెక్షన్ 156(3) కింద తాజా దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ కేసులో మరో నిందితుడు జెరూసలేం మత్తయ్యపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసిందని, అవినీతి కేసులో ప్రోత్సహించాడనే అభియోగాలను పరిగణనలోకి తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసిందన్నారు. అనంతరం కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌పై ఏసిబి తాజా దర్యాప్తుకు గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సింగిల్ జడ్జి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే ఇచ్చింది. దీనిపై ఎమ్మెల్యే ఏ రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసును హైకోర్టు విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.