రాష్ట్రీయం

ఉగ్రవాదానికి కొత్త ముసుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: సమాజానికి శాపంలా పరిణమిస్తోన్న ఉగ్రవాదం సైబర్ టెక్నాలజీతో కొత్తరూపం దాల్చిందని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడంలో రాజీ పడొద్దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. కొత్తగా పుట్టుకొస్తున్న నేరాలను అర్థం చేసుకొని నేర సంఘటనలను పరిశీలిస్తూ, సైబర్ నేరాలు, ఫోరెన్సిక్ సంబంధిత నేరాలు, మాదక ద్రవ్య నేరాలను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత యువ ఐపీఎస్‌లపై ఎంతైనా ఉందన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో రాజీ పడొద్దని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంతో దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడుతోందన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన 68వ ఆర్‌ఆర్ బ్యాచ్ 2016 దీక్షాంత్ పాసింగ్ ఔట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 109మంది ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విశ్వసనీయతే అత్యున్నత ప్రాధాన్యం కావాలని, నిష్పక్షపాతం, మానవతాదృక్పథంతో వ్యవహరిస్తూ పనితీరును మెరుగుపర్చుకోవాలని ఈ సందర్భంగా కొత్త ఐపీఎస్‌లకు సూచించారు. కొత్త ఉత్సాహంతో సమాజసేవకు సిద్ధమవుతోన్న ఐపీఎస్‌లకు విజయం వెన్నంటే ఉండాలని ఆకాంక్షించారు. వృత్తిలో మానవత, ప్రతిభ, నిష్పాక్షిత ప్రదర్శించిన వారే ప్రజల్లో అత్యుత్తమ పోలీస్ అధికారులుగా గుర్తుండిపోతారన్నారు. వృత్తిలో ఎదుగుదలకు దగ్గరి మార్గాలు అనేకం కనిపిస్తుంటాయి, మిమ్మల్ని ఊరిస్తుంటాయి. ఆ దారుల్లో వెళ్తే తాత్కాలిక విజయాలు దక్కవచ్చు. కానీ అవి శాశ్వత విజయాలు కావన్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. అంతకుముందు స్వాగతోపన్యాసంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ మాట్లాడుతూ నాయకులుగా, నిర్ణయాత్మక శక్తులుగా సమాజంలో అడుగుపెడుతున్న ఐపీఎస్‌లు చాలా అదృష్టవంతులన్నారు. 21వ శతాబ్దం మీకు అవసరమైన సమగ్ర సాధన సంపత్తి అందిస్తోంది. సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ముంగిట ఉన్నాయి. సాంకేతికంగా గణాంకాలు, సంఘటనల వివరాలు అరచేతిలో ఉంటాయన్నారు. అకాడమీలో 45 వారాలపాటు సమగ్ర శిక్షణ తీసుకున్న అధికారులు, బాధ్యతలు నిర్వర్తించాల్సిన ప్రాంతాల్లో అత్యుత్తమ సేవలు అందించగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొబెషనరీ ఆఫీసర్లచే ప్రతిజ్ఞ చేయించారు.
109మంది ఐపీఎస్ ప్రొబేషనరీల్లో 26మంది మహిళా ఆఫీసర్లు ఉన్నారు. రాయల్ భూటాన్ సర్వీసు నుంచి ఆరుగురు, నేపాల్ పోలీస్ సర్వీసు నుంచి ఐదుగురు, మాల్దీవ్ పోలీస్ సర్వీసు నుంచి నలుగురు శిక్షణ పొందారు. వీరిలో ప్రతిభ కనబర్చిన పదిమంది యువ ఐపీఎస్‌లకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ట్రోఫీలు అందించారు. మొత్తం 109మంది ట్రైనీ ఐపీఎస్ అధికారుల్లో ఏడుగురిని తెంలగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రం కేటాయించిన విషయం తెలిసిందే. వారిలో తెలంగాణకు రక్షిత కె మూర్తి (కర్ణాటక), పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపత్‌రావు (మహరాష్ట్ర), చేతన మైలబత్తుల (తెంలగాణ), ఆంధ్రకు కె ఆరిఫ్ హఫీజ్ (కర్ణాటక), అజిత వేజెండ్ల (ఏపి), గౌతమి సలి (ఏపి) బరుణ్ పురకయత్స (అస్సోం) ట్రైనీ ఐపీఎస్‌లుగా రానున్నారు.

చిత్రం... 68వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో ప్రొబేషనరీ ఐపిఎస్‌ల నుంచి
గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ