రాష్ట్రీయం

జన్మభూమితో జనంలోకి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 30: మూడోవిడత జన్మభూమిని విస్తృతంగా ప్రచారం చేయాలని, పార్టీ నేతలు, కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరూ ఇందులో చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి, అధికార తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జనవరి రెండు నుంచి చేపడుతున్న తాజా జన్మభూమి కార్యక్రమంలో గ్రామస్థాయి నుంచి పట్టణ డివిజన్, వార్డు స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష హోదాలో బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావుతోపాటు 13 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు జన్మభూమిని ఒక వేదికగా మలుచుకోవాలని అన్నారు. ప్రధానంగా నీరు-చెట్టు, నీటిగుంటలు, పట్టిసీమ పథకం ద్వారా గోదావరి నీటి తరిలింపు వంటి కార్యక్రమాల గురించి వివరించాలని అన్నారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 12.45 లక్షల రేషన్‌కార్డులను అందజేస్తున్న విషయాన్ని ప్రజలకు తీసుకొనివెళ్లాలని అన్నారు. లోకేష్‌పై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.